–ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే
బెంగళూరు: భారత ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంత్రిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే విమర్శించారు. ట్రంప్ ఎదుట.. ప్రధాని మోదీ బానిసలా మారినట్లు ఖడ్గే అన్నారు. కర్ణాటకలోని కలబురగిలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఎప్స్టీన్ ఫైల్స్‌ను అడ్డుపెట్టుకుని మన ప్రధానిని ట్రంప్ ఆడిస్తున్నారు. మొన్నటి మధ్యంతర వాణిజ్య ఒప్పందం నుంచి తాజాగా ముడిచమురు కొనుగోళ్ల వరకూ ట్రంప్ ఆదేశాల మేరకే జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల నాయకులంతా అమెరికా యుద్ధ కాంక్షతో భయపడిపోతున్నారు. కానీ, ఓ దేశ ప్రధానిగా మోదీ ఈ యుద్ధంపై, నాయకుడి హత్యపై ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆంగ్లేయులను ఎదుర్కొని కాంగ్రెస్ దేశానికి స్వాతంత్య్రం తెస్తే… ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ప్రపంచ దేశాల ముందు దేశాన్ని బానిసగా మార్చిందని ఖడ్గే విమర్శించారు.


