విశాఖపట్నంకు చెందిన ఎన్ఆర్ఐలు త్రిపురనేని వెంకటరత్నం, శ్రీమతి మాధురి దంపతులు ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు.అదేవిధంగా ఆయన కుమారులు త్రిపురనేని విజయ్, త్రిపురనేని వినయ్ లు కూడా వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల ప్రతినిధి పొట్లూరి నరసింహారావు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.


