టిడిపి ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ


విశాలాంధ్ర, ఉరవకొండ అనంతపురం జిల్లా

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మరియు ఆయన సోదరుడు పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాలతో ఉరవకొండ పట్టణంలో చిరు వ్యాపారులకు శనివారం టీడీపీ నాయకులు గొడుగులు పంపిణీ చేశారు. వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో రోడ్లపై వ్యాపారం చేసే చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారికి సహాయంగా ఈ గొడుగులను అందజేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ విజయభాస్కర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్యారం కేశవానంద, పార్టీ నాయకులు కట్టబడి కలందర్, నిరంజన్ గౌడ్, తిమ్మప్ప, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

The post టిడిపి ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *