జి ప్లస్ త్రీ అర్జీదారుల నగదు వాపస్….మున్సిపల్ కమిషనర్ లోవరాజు


విశాలాంధ్ర నందిగామ:- జి ప్లస్ త్రీ ఇళ్ల లబ్ధిదారులు తమ ఒరిజినల్ పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో అందజేసి అర్జీ సమయంలో తాము కట్టిన నగదును తమ అకౌంట్ నందు జమ చేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ లోవరాజు తెలిపారు జి ప్లస్ త్రీ ఇళ్ల లబ్ధిదారులు తాము చెల్లించిన డబ్బులకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను మున్సిపల్ కార్యాలయానికి అందించి అర్జిదారులు కట్టిన సొమ్మును వెనక్కి తీసుకోవాలని తెలిపారు దానిలో భాగంగా నందిగామ మున్సిపల్ కార్యాలయానికి 1492 మంది ఎక్కువ మొత్తం చెల్లించిన వారు ఉండగా 1284 మందికి సంబంధించిన 1 కోటి 70 లక్షల రూపాయలు మున్సిపల్ అకౌంట్ కు జమ చేయనట్లుగా మున్సిపల్ కమిషనర్ లోవరాజు తెలిపారు ఇప్పటికే మున్సిపల్ కార్యాలయం నుండి అబ్జిదారులందరికీ ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు తెలిపారు శనివారం నుండి అర్జీదారులు తమ ఒరిజినల్ పత్రాలతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని వారి బ్యాంకు అకౌంట్లు ఒరిజినల్ పత్రాలను జమ చేసి సెల్ఫ్ రిక్వెస్ట్ పత్రాన్ని పూర్తిచేసి సంబంధిత అధికారులకు అందజేస్తున్నట్లు తెలిపారు త్వరలోనే చెక్కుల ద్వారా గాని తక్కువ మొత్తంలో ఉన్నవారికి నగదు రూపంలో గానీ వారి నగదు అందజేయడం జరుగుతుందని కమీషనర్ తెలిపారు…

అసలేం జరిగింది….

పట్టణ పరిధిలోని జి ప్లస్ త్రీ ఇళ్ల సముదాయాల లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో లబ్ధిదారుల భాగస్వామ్యంలో ఇల్లు అందించేందుకు అప్పటి ప్రభుత్వం ముందుకు వచ్చి హనుమంతుపాలెం పరిధిలో జి ప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణాలకు ఎల్ అండ్ టి సంస్థతో ఒప్పందమై నిర్మాణలు ప్రారంభించింది ఆ సమయంలో లబ్ధిదారుల నుండి అర్జీలు సేకరించగా సుమారు 2800 మంది అర్జీ చేసుకున్నారు అందులో అర్జీ దారి మూలదనం 500 ఒక స్లాబుగా ఉంటే 12,500, 25000 దపాల వారీగా సేకరించారు గ్రేడ్లను బట్టి అర్జదారులు స్తోమతను బట్టి వారికి జి ప్లస్ త్రీ సముదాయాలలో గృహాలు శాంక్షన్ చేయటం జరిగింది ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో గెలిచిన వైసిపి ప్రభుత్వం జి ప్లస్ త్రీ నిర్మాణాలను పూర్తిస్థాయిలో నిలిపివేసింది జి ప్లస్ త్రీ నిర్మాణ కాంటాక్ట్లను దక్కించుకున్న ఎల్ అండ్ టి సంస్థ ఆ నిర్మాణాలను ఆ కాంట్రాక్టర్లను వదులుకొని పనులు నిలిపివేసింది అప్పటికే డబ్బులు కట్టిన వారు ఎన్నిసార్లు కార్యాలయాలు చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకుండా పోయింది 2024లో కూటమి ప్రభుత్వం రావడంతో తెలుగుదేశం ప్రభుత్వం గెలుపొందినప్పటి నుండి జి ప్లస్ త్రీ సమదాయాలను పరిశీలించగా కొన్ని ప్రాంతాలు అనుకూలంగా మరికొన్ని ప్రాంతాలు ప్రతికూలంగా ఉండటం ఎక్కువ సమయం పూర్తి చేయకుండా నిలిచిపోవటం వలన లబ్ధిదారులకు వారు కట్టిన డబ్బులను ప్రభుత్వం వెనక వెనక్కు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టింది….



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *