జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యం


విశాలాంధ్ర-రాప్తాడు(అనంతపురం జిల్లా): జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చాలన్న జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు భారీ సోదాలు నిర్వహించారు. అనంతపురం రూరల్ సబ్ డివిజన్ అధికారి పర్యవేక్షణలో రాప్తాడు మండలం మైనార్టీ కాలనీలో ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ చేపట్టారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులందరూ తమ సిబ్బందితో కలిసి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని పలు ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, స్థానిక ప్రజలకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలైతే జీవితాలు చిన్నాభిన్నమవుతాయని, యువత ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. మత్తు పదార్థాల విక్రయదారులు రవాణా చేసే వారి సమాచారాన్ని తక్షణమే పోలీసులకు అందజేయాలని, సమాజం నుంచి డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రాప్తాడు, శింగనమల, బుక్కరాయసముద్రం
సర్కిల్ సిఐలు శ్రీహర్ష
కౌలుట్లయ్య, పుల్లయ్య నార్పల, గార్లదిన్నె, ఇటుకలపల్లి ఎస్సైలు సాగర్, గౌస్, ఎస్సై విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.

The post జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *