విశాలాంధ్ర – పార్వతీపురం : జిల్లాలోని అన్ని విభాగాలనుండి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ దారుల ఐక్య కార్యాచరణసమితిను మంగళవారంనాడు ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు జి.వి.ఆర్.ఎస్. కిషోర్, కార్యదర్శి రంగాచారిలు తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాస్థాయిలో జాయింట్ యాక్షన్ కమిటీను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సంఘాన్ని మరింత పటిష్టంగా నిర్మించాల్సిన బాధ్యత, అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల బాధ్యత ఇతరఅంశాలపై కూలంకషంగా వివరించారు. అన్ని సంఘాల నాయకులంతా జాయింట్ యాక్షన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులుగా ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు జి.వి.ఆర్.ఎస్ . కిషోర్,కో-చైర్మన్లుగా ఎన్ బాలకృష్ణ (ఏపీటిఎఫ్), కె శంకరరావు (ఆర్టీసీ)కె.రంగాచారిలు (ఏపీఎన్జీఓ) వైస్ చైర్మన్లుగా కె. భాస్కరరావు(యుటి ఎఫ్), అమరాపు సూర్యనారాయణ (పిఆర్ టియు), పి.కూర్మినాయుడు (ఏపీటిఎఫ్) మజ్జి మురళిబాబులు (ఎస్టియు), సెక్రటరీజనరల్ గా సి హెచ్ రాములను (ఏపీపిటిఎంఎ) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాయింట్ సెక్రటరీలుగా పిశ్రీరాములు , సిహెచ్ గణపతి, ఏ బాలాజీరావు,డి గణపతిరావు , (పెన్షనర్స్) జిఎం రత్నం) మెడికల్), జ్యోష్ణ ( పిఆర్) ఆర్గనైజింగ్ సెక్రెటరీ. కె విజయ్ కుమార్ (కమర్షియల్ టాక్స్)
కోశాధికారిగా సువ్వాడ దుర్గా ప్రసాద్ లను ఎన్నుకున్నారు. ఈసిమెంబర్లుగా చంద్రసాయి,అమరావతి, పృథ్వీరాజ్ , టి దిలీప్ కుమార్,ఏ శ్రీనివాసరావు, పి జయకుమార్,టి శ్రీధర్,స్వామినాయుడు, బి సంతోష్ కుమార్ ,జి పద్మావతి, జి శ్రీనివాసరావు, కె కృష్ణారావు,ఎం నర్సింగరావులు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. అనంతరం జరిగినసమావేశంలో పలు తీర్మానాలు చేపట్టినట్లు తెలిపారు.ప్రతినెలా జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించుకోవాలని, రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చే ఏపిలుపుకైనా అందరం ఐక్యంగా సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు. పెండింగ్ డిఏలు, పీఆర్సీ కమిషన్, అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ , సీపీఎస్ రద్దుచేయాలని మరియు పార్వతీపురం జిల్లాజాయింట్ యాక్షన్ కమిటీను మరింత పటిష్టంగా, శక్తివంతంగా నడిపించాలని తీర్మానించినట్లు తెలిపారు.


