విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో శనివారం ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి పర్యవేక్షణలో ఆపరేషన్ వజ్ర పహార్ లో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోసిగి సీఐ మంజునాథ్, పెద్దకడబూరు ఎస్‌ఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానిత ప్రాంతాల్లో, షాపుల్లో, ఇళ్లల్లో, పంట పొలాలు గంజాయి, మద్యం, గుట్కాలు, నాటుసారాపై పోలీసులు సోదాలు చేశారు. అనంతరం డీఎస్పీ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, పంట పొలాల్లో గంజాయిని సాగుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని, గ్రామంలో బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో 4 సీఐలు, 4 ఎస్ఐలు, 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
The post జాలవాడిలో కార్డన్ సెర్చ్ appeared first on Visalaandhra.


