జాన్వీకి ‘పెద్ది’ టీమ్ పుట్టినరోజు కానుక


హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శక త్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ శుక్రవారం 29వ పుట్టినరోజు జరుపుకుంటు న్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఆమెకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రంలో జాన్వీ ‘అచ్చియమ్మ’ అనే పల్లెటూరి యువతి పాత్ర పోషిస్తోంది. ఇందులో దర్శకుడు బుచ్చిబాబు తనదైన శైలిలో జాన్వీ అందాన్ని వర్ణించిన తీరు ఆకట్టుకుంటోంది. “కాటుక అక్కర్లేని ఆ కళ్లు, ముక్కుపుడక అక్కర్లేని ఆ ముక్కు.. అంటే అలంకరణ అక్కర్లేని అరుదైన చికిరియే ఈ చికిరి” అంటూ ఆయన చెప్పిన మాటలతో ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ సరసన జాన్వీ నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే చివరి దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
శ్రీవారి సేవలో…
బాలీవుడ్ నటి, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఏటా తన పుట్టినరోజున తిరుమలకు రావడం ఆనవాయితీగా పెట్టుకున్న జాన్వీ, ఈ ఏడాది కూడా తన మొక్కును తీర్చుకున్నారు. గురువారం రాత్రి జాన్వీ కపూర్ అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. తెల్లటి కుర్తా ధరించి, చెవులకు ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని 3,500 మెట్లను ఆమె ఎక్కారు. ఆమె వెంట సీనియర్ నటి మహేశ్వరితో పాటు భద్రతా సిబ్బంది ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున స్వామివారిని వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *