జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి..


సీనియర్ సివిల్ జడ్జ్, చైర్మన్ వెంకటేశ్వర్లు
విశాలాంధ్ర ధర్మవరం;; మార్చి 14వ తేదీన నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జ్, చైర్మన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా జడ్జి చాంబర్లో కోర్టు పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో సిఐలకు, ఎస్ఐలకు, కోర్టు న్యాయవాదులతో వారు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలతో ఇచ్చిన తీర్పు తుది తీర్పు అవుతుందని, ఈ విషయాన్ని కచ్చి దారులకు తప్పక అవగాహన కల్పించినప్పుడే ఈ లోక్ అదాలత్ విజయవంతం అవుతుందని తెలిపారు. రాజీకి కాపడే కేసులు మాత్రమే ఈ అదాలత్ పంపాలని తెలిపారు. కోర్టు పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్లో రాజీకు తగ్గ కేసులపై సమగ్ర విచారణ జరిపి, రాజి అయ్యే విధంగా తమ వంతు సహాయ సహకారాలు అందించి జాతీయ లోక్ అదాలత్ నమోదు చేసుకోవాలని తెలిపారు. తదుపరి ప్రతి పోలీస్ స్టేషన్ నుండి రాజీకు తగ్గ కేసులో వివరాలను జడ్జి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వా న్యాయవాది ఆదినారాయణమ్మ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *