టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండల కేంద్రం సమీపంలోని రాప్తాడు చెరువు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళీ అధికారులకు సూచించారు.బుధవారం ఆయన చెరువు వద్ద జరుగుతున్న పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాలతో ఏపీఓ సావిత్రి, ఈసీ మురళి, సోమర నారాయణస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్లు తలారి శివ, వినోద్ లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న వాకింగ్ ట్రాక్ మరియు చిల్డ్రన్స్ పార్క్ పనుల పురోగతిని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే ఈ సుందరీకరణ పనులను, పిల్లల పార్కును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. తమ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు ప్రజలు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


