20సంవత్సరాలు మండలపార్టీ బాధ్యతలు
ఘనంగా సన్మాణించిన ఎమ్మెల్యే ఇంటూరి
విశాలాంద్ర -వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు చెరువుపల్లి మాల్యాద్రిని తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పార్టీకి చేసిన సేవలు గుర్తించి ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వెన్నంటే ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వదలకుండా పార్టీకి సేవ చేస్తూ మండలంలోని కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి మండలంలోని కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ముందుండి పార్టీ కి విశేష కృషి చేశారు. వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులుగా 20 సంవత్సరాలు (4సార్లు )మండల పార్టీ అధ్యక్షులుగా స్వీకరించి పార్టీ కి సేవ చేశారు. అదేవిదంగా పవిత్ర పుణ్యక్షేత్రం అయిన మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా రెండు సంవత్సరాలు సేవలందించారు.జిల్లా పార్టీ సమన్వయకర్తగా రొండు సంవత్సరాలు పని చేశారు. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కు మారుపేరుగా నిలిచారు.ఈ సందర్భంగా సన్మాన గ్రహీత చెరువుపల్లి మాలాద్రి మాట్లాడుతూ తమ సేవలు గుర్తించి తనకు సన్మానం చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కి అభినందనలు తెలియజేశారు.ఈ సన్మానం మరింత బాధ్యత పెంచిందని,రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని
ఆయన స్పష్టం చేశారు. చెరువుపల్లి మాల్యాద్రి మరెన్నో పదవులు అదిరోహించాలని, మరెన్నో సన్మానాలు జరుపుకోవాలని మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


