చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం – Visalaandhra


ఉత్తమ నటీనటులు రష్మిక, నాగ చైతన్య
. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి, ద్వితీయ ఉత్తమ చిత్రం దండోరా
. కమల్ హాసన్‌కు పైడి జయరాజ్… సుద్దాలకు సినారె అవార్డు
. గద్దర్ అవార్డు గ్రహీతలకు 19న సత్కారం

విశాలాంధ్ర-హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ను శనివారం ప్రకటించింది. జ్యూరీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి అవార్డుల తుది జాబితా అందజేశారు. అనంతరం అవార్డు కమిటీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ అవార్డు విజేతలను ప్రకటించారు. అగ్ర కథానాయకుడు చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ఎంపిక చేశారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్‌ను పైడి జయరాజ్ అవార్డు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజను సినారె అవార్డు వరించింది. 2025 జనవరి ఒకటి నుంచి డిసెంబరు 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకు, షార్ట్‌ఫిల్మ్‌లకు ఈ అవార్డులు ప్రకటించారు. ఈ నెల 19 ఉగాది రోజున పురస్కారాలు ప్రదానం చేస్తారు. బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు సింగీతం శ్రీనివాసరావుకు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డును అశ్వనీ దత్‌కు, కేఎల్ కాంతారావు ఫిల్మ్ అవార్డు ఆర్.నారాయణమూర్తి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు రమేశ్ ప్రసాద్, సి.నారాయణరెడ్డి ఫిల్మ్ అవార్డు సుద్దాల అశోక్ తేజ, అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డు జయసుధ దక్కించుకున్నారు.ఉత్తమ నటీనటులుగా రష్మిక మందాన, అక్కినేని నాగచైతన్య ఎంపికయ్యారు. ఫీచర్ ఫిల్మ్స్… ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా, ఉత్తమ తృతీయ చిత్రం – ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం – తండేల్, ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వా, ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ (డెబ్యూ) – లిటిల్ హార్ట్స్, ఉత్తమ వినోదాత్మక చిత్రం -సంక్రాంతికి వస్తున్నాం, ఉత్తమ సామాజిక సందేశాత్మక చిత్రం – కోర్ట్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిల్మ్ – మిరాయ్, ఉత్తమ బాలల చిత్రం – అనగనగా, ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి), ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్), ఉత్తమ నటి – రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్), ఉత్తమ సహాయ నటుడు – శివాజీ (దండోరా), ఉత్తమ సహాయ నటి – భూమిక (యుఫోరియా), ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ కె.రాబిన్ (దండోరా), ఉత్తమ గాయకుడు – అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి), ఉత్తమ గాయని – సాహితీ (కన్నప్ప), ఉత్తమ హాస్య నటుడు – కృష్ణ తేజ్ రెడ్డి (జిగ్రీస్), ఉత్తమ బాలనటుడు – మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో), ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్ (యుఫోరియా), ఉత్తమ స్క్రీన్‌ప్లే – అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం), ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్ (కుబేర), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్), ఉత్తమ ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్), ఉత్తమ ఆడియోగ్రాఫర్ – ఎం.ఆర్. రాధాకృష్ణన్ (కిష్కింధపురి), ఉత్తమ కొరియోగ్రాఫర్ – సందీప్ (ఛాంపియన్), ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ – తోట తరణి (ఛాంపియన్), ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – వై.గోవిందరాజు (అఖండ 2), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – చంద్రకాంత్ సొనావాని, అజయ్‌కుమార్ నంబాల (ఛాంపియన్), ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ – పీటర్ హెయిన్స్ (ఛాంపియన్). స్పెషల్ జ్యూరీ అవార్డులు… శ్రీరాజ్ రాచకొండ (23 ఫిల్మ్), చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి), రోషన్ మేక (ఛాంపియన్), అనంతిక సనీల్ కుమార్ (8 వసంతాలు), ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ యూనిటి (మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్) – చిరందాస్ శ్రీకాంత్, ది ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జయరాజ్ ప్రస్థానం – పొన్నం రవిచంద్ర, మహామనిషి డాక్టర్ ఏఎస్ రావు – బాలబ్రహ్మచారి పూసపాటి. ఉత్తమ షార్ట్స్ ఫిల్మ్స్… వనజీవి రామయ్య – భూసం రవీంద్రనాథ్, మౌనమే నీ భాష – రవీంద్రవర్మ ఇందుకూరి, విశ్వాస్ హనుకర్ సైబర్ స్లేవరీ – కె.నీలిమ, డిప్లొమా ఆఫ్ మెరిట్: తల్లిదండ్రుల ఆత్మ గౌరవం (కనపర్తి హనుమండ్లు), బెస్ట్ బుక్ ఇన్ తెలుగు- శూన్యం నుంచి శిఖరాగ్రాలకు (ప్రభు), ఉత్తమ సినీ విమర్శకుడు – హెచ్ రమేశ్‌బాబు.
చిరుకు పవన్ కల్యాణ్ అభినందనలు
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించగా … చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారం వరించింది. దీంతో ఆయనకు అభినందనలు చెబుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోస్ట్ పెట్టారు. ఈ వార్త తనకెంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. గద్దర్ అవార్డులకు ఎంపికైన ప్రతి ఒక్కరికీ పవన్ శుభాకాంక్షలు తెలిపారు.
దుల్ల కొట్టావ్ నాన్న: నాగార్జున
గద్దర్ అవార్డుల విజేతలకు అగ్ర హీరో నాగార్జున కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తన కుమారుడు నాగచైతన్యను ప్రత్యేకంగా అభినందించారు. చైతూ ఉత్తమ నటుడిగా ఎంపికైనందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ‘తండేల’ సినిమాలో అద్భుతంగా నటించాడని, ఈ అవార్డుకు అతడు అర్హుడని కొనియాడారు. ‘దుల్ల కొడతా నాన్న’ అంటూ తండేల్ డైలాగుకు హార్ట్ ఎమోజీ జోడించి అభినందించారు. తెలంగాణ ప్రభుత్వానికి నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. ఏయన్నార్ పేరుతో అవార్డును ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏయన్నార్ అవార్డు జయసుధకు రావడం ఆనందంగా ఉందన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *