ఘనంగా ప్రారంభమైన షాప్ జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు


వన్ టౌన్ ఎస్ఐ ఉమాదేవి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలో షాప్ జిల్లా సాయి సైక్లింగ్ ఎంపికలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా వచ్చిన వన్ టౌన్ ఎస్ఐ ఉమాదేవి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ ,స్కూల్ గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎంపికలు కాలేజీ సర్కిల్ నుంచి ప్రియదర్శిని స్కూల్ వరకు నిర్వహించామని తెలిపారు. గెలుపొందిన విజేతలకు ఈనెల 28 నుంచి మార్చి 1వ తేదీ విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా రాధికార సంస్థ శిక్షకులు ఓం ప్రకాష్, ప్రతాప్, అసేంట్ తదితరులు పాల్గొన్నారు

The post ఘనంగా ప్రారంభమైన షాప్ జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *