అంతుచిక్కని రహస్యంగా మారిన గ్రహాంతరవాసులపై ప్రపంచవ్యాప్తంగా మరోమారు చర్చ నడుస్తోంది. ఇటీవల అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్న గ్రహాంతర వాసుల (Aliens) సమాచారాన్ని బహిర్గతం చేస్తామని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (DONALD TRUMPH)) వెల్లడించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (OBAMA).. ఏలియన్స్ ఉనికిపై వ్యాఖ్యలు సంచలనం సృష్ఠించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫెడరల్ ఏజెన్సీలకు ట్రంప్ మార్గదర్శకాలు జారీ చేశారు.అనేక దశాబ్దాలుగా అమెరికన్లు కోరుతున్న విధంగా యూఎఫ్వో, గ్రహాంతర వాసులకు సంబంధించిన ప్రభుత్వ ఫైళ్లను గుర్తించి.. విడుదల చేయాలంటూ ఫెడరల్ ఏజెన్సీలను ఆదేశిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. విడుదల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు.
దశాబ్దాలుగా అనేకమంది అమెరికన్లు తమ ప్రభుత్వం వద్ద ఉన్న గ్రహాంతర జీవుల సమాచారాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని ట్రంప్ అన్నారు. అందుకే వాటికి సంబంధించిన ముఖ్యమైన.. ఆసక్తికరమైన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో ఒబామా గ్రహాంతర వాసుల ఉనికి గురించి మాట్లాడుతూ ఓ రహస్య విషయాన్ని వెల్లడించారని ట్రంప్ మండిపడ్డారు. ఆయన అలా చేసి ఉండకూడదన్నారు. అయితే ఒబామా చెప్పిన రహస్యం ఏంటనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.


