ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ (LPG) సరఫరా సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడవచ్చన్న ఆందోళనల దృష్ట్యా, శనివారం ఉదయం మంత్రులతో ఆయన అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హోటళ్లు సహా భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని మంత్రులకు చంద్రబాబు సూచనలు ఇచ్చారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా చూడాలని మంత్రులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు ఉన్నారు. ఈరోజు ఉదయం 11:30 గంటలకు సివిల్ సప్లై భవనంలో మంత్రుల సమావేశం జరగనుంది.
The post గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ appeared first on Visalaandhra.


