– మంత్రి సత్య కుమార్ యాదవ్ తక్షణ స్పందన
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గంలోని గొట్లూరు గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ తక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. గొట్లూరు గ్రామ ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని గ్రామ ప్రజలు, బీజేపీ నాయకుడు ,సింగిల్ విండో డైరెక్టర్ గొడ్డిటి వెంకటేష్ కలిసి మంత్రి కు వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా ఆ రహదారిపై శివాలయం ఉండడం, అలాగే ఒక ప్రముఖ కార్పొరేట్ పాఠశాల ఉండడం వల్ల నిత్యం భారీగా ప్రజల రద్దీ ఉండటంతో ప్రమాదాల అవకాశాలు అధికంగా ఉన్నాయని వారు తెలియజేశారు. గతంలో కూడా ఆ ప్రాంతంలో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల, బీజేపీ నాయకుడు గొడ్డిటి వెంకటేష్ విజ్ఞప్తిని సానుకూలంగా స్వీకరించిన మంత్రి సత్య కుమార్ యాదవ్ వెంటనే స్పందించి ఆర్ & బి (రోడ్లు & భవనాలు) శాఖ అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు వేగంగా చర్యలు చేపట్టి, గొట్లూరు గ్రామ ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు బీజేపీ నాయకుడు గొడ్డిటి వెంకటేష్ మంత్రికు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
The post గొట్లూరులో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు appeared first on Visalaandhra.


