9 మంది అరెస్ట్ – రూ.1.85 లక్షలు, 9 సెల్ఫోన్లు స్వాధీనం
విశాలాంధ్ర–కదిరి: పట్టణంలోని గజ్జలరెడ్డిపల్లి కాలనీలో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి నిర్వహించి 9 మంది జూదరులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.1,85,000 నగదు మరియు 9 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శివన్నారాయణ స్వామి, పట్టణ సీఐ డీవీ నారాయణరెడ్డి తెలిపారు.జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, గజ్జలరెడ్డిపల్లి కాలనీలో పేకాట జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో దాడి చేపట్టినట్లు వారు వివరించారు. దాడి సమయంలో పేకాటలో నిమగ్నమైన 9 మందిని అదుపులోకి తీసుకుని, నగదు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ప్రజలు చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ దాడిలో ఎస్సై భువనేశ్వరి సహా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


