ఖమేనీ మృతి.. కచ్చితంగా బదులు తీర్చుకుంటాం: ఇరాన్‌ హెచ్చరిక


సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతికి కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఖమేనీ మృతిని ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేది లేదని ఇరాన్‌ క్యాబినెట్‌ పేర్కొంది. ఖమేనీ మృతిపై ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ (IRGC)సంతాపం   తెలిపింది.  తమ సుప్రీం లీడర్‌ను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని, చరిత్రలో ఎన్నడూ చూడని భయంకర దాడులు జరగొచ్చని హెచ్చరించింది. ఇక, ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలేది లేదని ఇరాన్ క్యాబినెట్ పేర్కొంది.

ఇజ్రాయెల్‌, యూఎస్‌ స్థావరాల లక్ష్యంగా భారీ ఆపరేషన్‌ చేపట్టేందుకు ఐఆర్‌జీసీ సిద్ధమైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఇక, అమెరికా- ఇజ్రాయెల్‌ దాడుల్లో ఖమేనీ కీలక సలహాదారులు అలీ షంఖానీతో పాటు ఐఆర్‌జీసీ చీఫ్‌ మహమ్మద్‌ పాక్‌పౌర్‌ ప్రాణాలు కోల్పోయారని తాజాగా ఇరాన్‌ ధ్రువీకరించింది. ఈ క్రమంలో ఐఆర్‌జీసీ తన కొత్త కమాండర్‌-ఇన్‌-చీఫ్‌ను నియమించింది. మాజీ రక్షణ మంత్రి అహ్మద్‌ వాహిదీకి ఆ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *