డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మి
విశాలాంధ్ర ధర్మవరం:: క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ శ్రేయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల అవగాహన కొరకు పట్టణములో పలుచోట్ల ర్యాలీనిర్వహించారు. తదుపరి వారు మాట్లాడుతూ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా క్షయ వ్యాధి అనుమానితులను ప్రభుత్వ ఆసుపత్రికి మందుల కొరకు పంపాలని, క్షయ వ్యాధి నిర్ధారణ కొరకు కూడా పంపవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. ప్రతి క్షయ వ్యాధి పేషెంట్ కూడా మందులను సకాలంలో వాడుకొని వ్యాధిని నయం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఎవరైనా రెండు వారాలకు మించి తగ్గు ఉన్నట్లయితే సాయంత్రం పూట జ్వరం రావడం ,బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం ఇలాంటివన్నీ క్షయ వ్యాధి లక్షణాలు అని తెలిపారు. అలాంటప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నజీర్, అర్బన్ సెంటర్ వైద్యులు డాక్టర్ ప్రియాంక, డాక్టర్ శ్రావణి, డాక్టర్ సురేష్ నాయక్ తో పాటు అర్బన్ సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశాలు, సివోలు, ఐ సి టి సి విభాగం వారు, ఎన్జీవో సంస్థలు పాల్గొన్నాయి.


