క్లిష్ట హృదయ చికిత్సలో అద్భుతం.. కిమ్స్ డాక్టర్‌కు భారీ గుర్తింపు..! interventional cardiology award. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

India Live 2026లో డా. గణేష్ కాశీనాథుని KIMS Hospital తరఫున టాప్ 5 బెస్ట్ కేసెస్ అప్రీషియేషన్ అవార్డు సాధించి విశాఖ గుండె చికిత్స ప్రతిష్ఠను పెంచారు.

డా. గణేష్ కాశీనాథునికి జాతీయ స్థాయి గుర్తింపు..
డా. గణేష్ కాశీనాథునికి జాతీయ స్థాయి గుర్తింపు..

దేశవ్యాప్తంగా వైద్య రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ మహాసభలో విశాఖకు గర్వకారణమైన ఘనత లభించింది. India Live 2026 లో KIMS Hospital కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. గణేష్ కాశీనాథుని తన ప్రతిభతో మెప్పించి “టాప్ 5 బెస్ట్ కేసెస్ అప్రీషియేషన్ అవార్డు”ను అందుకోవడం విశేషంగా నిలిచింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన నిపుణుల మధ్య ఈ గుర్తింపు పొందడం ఆయన ప్రతిభకు నిదర్శనం.

దేశంలోని అగ్రశ్రేణి కార్డియాలజిస్టులు పాల్గొన్న ఈ మహాసభలో 1,000కు పైగా క్లిష్టమైన హృదయ సంబంధిత కేసులు సమర్పించబడ్డాయి. అందులో కేవలం 250 కేసులు మాత్రమే ఓరల్ ప్రెజెంటేషన్‌కు ఎంపిక కావడం పోటీ తీవ్రతను తెలియజేస్తోంది. అలాంటి పోటీలో ఎంపిక కావడమే కాకుండా, టాప్ 5లో స్థానం దక్కించుకోవడం మరింత గొప్ప విషయం.

నేషనల్ ఫ్యాకల్టీ సభ్యుడిగానూ సేవలందించిన డా. గణేష్ కాశీనాథుని, కిమ్స్ హాస్పిటల్‌లో నిర్వహించిన అత్యంత క్లిష్టమైన హృదయ చికిత్సను ఈ వేదికపై ప్రదర్శించారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో తీవ్రమైన కాల్షియం నిల్వల వల్ల ఏర్పడే బ్లాకేజీలను, ముఖ్యంగా “లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్” వంటి సంక్లిష్ట ప్రాంతాల్లో ఎలా విజయవంతంగా పరిష్కరించారో వివరించారు.

ఈ కేసులో రోటాబ్లెషన్, లిథోట్రిప్సీ వంటి ఆధునిక పద్ధతులను వినియోగించి, ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ (OCT) సాంకేతికతతో ఖచ్చితమైన స్టెంటింగ్ చికిత్స అందించిన విధానం వైద్య నిపుణులను ఆకట్టుకుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రణాళికాబద్ధంగా తీసుకున్న నిర్ణయాలు, చికిత్సలో చూపిన నైపుణ్యం సభలో ప్రశంసలు అందుకుంది.

కేసు క్లినికల్ ప్రాముఖ్యతతో పాటు శిక్షణాత్మక విలువను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రెజెంటేషన్‌ను టాప్ 5లో ఎంపిక చేసి, కాన్ఫరెన్స్ ముగింపు కార్యక్రమంలో డా. గణేష్ కాశీనాథునిని సత్కరించారు. ఈ ఘనత విశాఖ వైద్య రంగానికి గౌరవాన్ని తీసుకువచ్చింది. ఈ విజయంతో KIMS Hospital అత్యాధునిక గుండె చికిత్సలందించడంలో తమ నిబద్ధతను మరోసారి చాటిచెప్పింది. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రంగంలో కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుని రోగులకు ఉత్తమ సేవలు అందించడంలో కిమ్స్ వైద్యులు ముందంజలో ఉన్నారని ఈ అవార్డు స్పష్టంగా నిరూపించింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *