కోర్టుకు బాంబు బెదిరింపు.. మెయిల్‌తో కలకలం.. పోలీసుల తనిఖీల్లో షాకింగ్ ట్విస్ట్..! Bomb threat at Kadiri court police say it is fake | అనంతపురం వార్తలు (Anantapuram News)


Last Updated:

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కోర్టులో బాంబు బెదిరింపు కలకలం, ఫేక్ సమాచారం అని నిర్ధారణ, పోలీసులు భద్రతా చర్యలు, సైబర్ నిఘా కట్టుదిట్టం.

+

సత్యసాయి

సత్యసాయి జిల్లాలో బాంబు  కలకలం….

ఇటీవల కాలంలో న్యాయస్థానాలు, విమానాశ్రయాలు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోర్టులో బాంబు ఉందని.. కదిరి న్యాయమూర్తికి ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు కక్షిదారులను బయటకు పంపించి భద్రతా చర్యలు చేపట్టారు.

స్థానిక పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బందితో కలిసి కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. కోర్టు భవనంలోని ప్రతి గది, పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టి పరిశీలించారు. అనంతరం ఇది ఫేక్ సమాచారం అని నిర్ధారించినట్లు టౌన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పోలీసులు స్పష్టం చేశారు.

ఇటీవల న్యాయస్థానాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి బాంబు బెదిరింపులు పెరుగుతున్నాయి. ఒక చిన్న ఫోన్ కాల్ లేదా ఈమెయిల్ వచ్చినా భద్రతా కారణాల వల్ల కోర్టు కార్యకలాపాలు నిలిపివేయాల్సి వస్తోంది. దీంతో ముఖ్యమైన కేసుల విచారణలు వాయిదా పడటంతో న్యాయ ప్రక్రియకు అంతరాయం కలుగుతోంది. కోర్టుల్లో నిత్యం వందలాది మంది ఉండటంతో ఇలాంటి బెదిరింపులు భయాందోళనలు సృష్టిస్తున్నాయి.

కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత కక్షలు, విచారణను వాయిదా వేయాలనే ఉద్దేశం లేదా సంచలనం సృష్టించాలనే ప్రయత్నాల వల్లే ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు. విదేశీ సర్వర్లు లేదా సాఫ్ట్‌వేర్ ఆధారిత కాల్స్ ఉపయోగించడం వల్ల నిందితులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారుతోంది. ఈ వెసులుబాటును కొందరు ఆకతాయిలు దుర్వినియోగం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు పోలీసులు సైబర్ నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ఫేక్ బాంబు బెదిరింపులు చేసే వారిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని పోలీసులు స్పష్టం చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *