కేరళ రాష్ట్రం పేరు ఇకపై కేరళంఃగా మారింది. సంబంధిత బిల్లుకు కేంద్ర క్యాబినెట్ నేడు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ నేడు ఆమోదం తెలిపింది. ఇకపై రాష్ట్రాన్ని ఃకేరళంః అని పిలిచేలా సంబంధిత బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మళయాళీ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా నిర్ణయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. తమ రాష్ట్రం పేరును మార్చాలనే ప్రతిపాదనలు మళయాళీ ప్రజల ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. కేరళను మలయాళంలో కేరళం అని పిలుస్తారని.. ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ 2023లో ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే.. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కొన్ని మార్పుల అనంతరం కేరళ అసెంబ్లీ మరోసారి ఆ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తర్వాత ఇది ఇన్నాళ్లూ కేంద్రం వద్ద పెండింగ్లో ఉండగా.. ఎట్టకేలకు మంగళవారం గ్రీన్ సిగ్నల్ లభించింది.


