విజయనగరం జిల్లా: కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విద్యా సంవత్సరానికి గాను 26 పాఠశాలల్లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ ద్వారా మార్చి 12 నుండి ఏప్రిల్ 1 వరకు అవకాశం ఉంది. ఆసక్తిగల విద్యార్థినులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించడమైనది. దరఖాస్తు గడువు తేదీని దృష్టిలో ఉంచుకుని త్వరగా అప్లై చేసుకోవాలి. మరింత సమాచారం కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


