విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కూటమి ప్రభుత్వంతోనే రైతుకు భరోసా ఉంటుందని సొసైటీ ఛైర్మన్ మీసేవ ఆంజనేయులు, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ముక్కన్న, యూనిట్ ఇంచార్జీ తలారి అంజి, సొసైటీ డైరెక్టర్లు ఎంజీ నరసన్న, హనుమేష్ అన్నారు. బుధవారం టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆదేశాల మేరకు మండల పరిధిలోని జాలవాడి, పెద్దకడబూరు గ్రామాలలో రైతన్న మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు అండగా నిలిచిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏడాదికి 20 వేల రూపాయలు పెట్టుబడి కింద ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఈరన్న, దిడ్డికాటి దేవేంద్ర, చెవిటి హనుమన్న, నరసింహులు, వీరేష్, రామకృష్ణ, కేజీ రవి, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
The post కూటమి ప్రభుత్వంతోనే రైతుకు భరోసా appeared first on Visalaandhra.


