కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు… ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు ఆవిరి!


మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మహోగ్రరూపం దాల్చిన నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు భగ్గుమనడంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీలు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఈ ఒక్క సెషన్‌లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.8 లక్షల కోట్లు ఆవిరైపోవడం మార్కెట్లలో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది.

ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 2,496.89 పాయింట్లు (3.26 శాతం) నష్టపోయి 74,207.24 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 775.65 పాయింట్లు (3.26 శాతం) పతనమై 23,002.15 వద్ద ముగిసింది. మధ్యప్రాచ్యంలో చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనలతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 11 శాతం పెరిగి బ్యారెల్‌కు 119.5 డాలర్లకు చేరింది. సౌదీ అరేబియాలోని కీలకమైన ఆయిల్ రిఫైనరీలపై డ్రోన్ దాడులు జరగడం, అరామ్ కో ప్లాంట్లలో మంటలు చెలరేగడం వంటి పరిణామాలు అమ్మకాలకు ఆజ్యం పోశాయి.ఈ పరిణామాలతో మార్కెట్లలో అస్థిరతను సూచించే ఇండియా వీఐఎక్స్ సూచీ 22 శాతానికి పైగా ఎగబాకింది. ఇది సమీప భవిష్యత్తులో కూడా ఇన్వెస్టర్లలో ఆందోళన కొనసాగవచ్చని సూచిస్తోంది. ప్రధాన సూచీలతో పాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ కూడా సుమారు 3 శాతం చొప్పున నష్టపోయాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *