తిరుపతిలో జరిగే ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి పిలుపు
కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం పోరాడుతూనే రాజకీయ చైతన్యంతో ప్రభుత్వాల తీరుపై ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ తిరుపతి నగర పదవ మహాసభలు స్థానిక గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ లో కె వై రాజా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైందని అన్నారు. కార్పొరేట్ కంపెనీలు, ఆన్ లైన్ వ్యాపారాలు పెరగడంతో కార్మికులు పనులు లేక వీధుల్లో పడ్డారని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం తో యాప్స్ రూపొందించి కోట్ల రూపాయలు కమిషన్ తీసుకుంటూ క్షేత్రస్థాయిలో నిత్యం కష్టపడుతున్న కార్మికులకు అన్యాయం చేస్తున్నారన్నారు. సమాజ అభివృద్ధి లో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని అటువంటి వారికి ప్రభుత్వం సమగ్ర చట్టాలు రూపొందించడం లేదని విమర్శించారు.కార్మికుల సంక్షేమ నిధులు పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడిపై భారం మోపిందన్నారు. ఇప్పటికే నిత్యవసర వస్తువులు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి అన్నారు. చంద్ర బాబు అన్ని రంగాల్లో ప్రైవేట్ పరం చేస్తున్నాడు అని చివరకు ప్రభుత్వ ఆసుపత్రులు సైతం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నాడని విమర్శించారు. ఏప్రిల్ నెల లో తిరుపతి నగరంలో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహా సభలను కార్మికుల పండగ లా వేలాది మంది పాల్గొని విజయవంతం చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, నగర కార్యదర్శి విశ్వనాథ్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు చంద్ర శేఖర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కే రాధాకృష్ణ, నగర కార్యదర్శి ఎన్ డి రవి, ఏఐటీయూసీ నాయకులు గోవిందస్వామి, ఎన్ శివ, శ్రీనివాసులు, మహేంద్ర, ఏపీ బాల, శెట్టిపల్లి రవి,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


