కవిత్వ పొలం గట్లమీదతెలుగు కవి బండ్ల మాధవరావు


రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
సెల్: 9440222117

నాగలంటే
మట్టిని చీల్చి
అన్నంముద్దను దోసిలిలో పెట్టేది కదా! (పు43) నూటపాతికేళ్ల ఆధునిక తెలుగు కవిత్వం ఎప్ప్పుడైనా పలచబడి ఉండవచ్చుగానీ, వ్యాపారాత్మకం మాత్రం కాలేదు. కథానికలు, నవలల్లో మనం వ్యాపార ధోరణిని ఇదివరకే గుర్తించాం. కవిత్వం మీద ఆ ఫిర్యాదు లేదు. వచన కవిత్వం వచనమై తేలిపోతున్నదనీ ఫిర్యాదు మాత్రం ఉంది. బాలగంగాధర్‌తిలక్, గుంటూరు శేషేంద్ర శర్మ, త్రిపురనేని శ్రీనివాస్ వంటి వాళ్లు 1960ల నుంచి “కవిత్వం కావాలి కవిత్వం” అని హెచ్చరిస్తూనే ఉన్నారు. తెలుగు వచన కవిత్వాన్ని వచనమై తేలిపోకుండా కషి చేస్తున్న కవి బండ్ల మాధవరావు. ఈయన గత మూడు దశాబ్దాలలో ఆరు కావ్యాలు ప్రచురించారు. 1. చెమట చిత్తడి నేల(1998) 2.స్పర్శ (2005) 3.అనుపమ (2014) 4.ఊరికల (2017) 5.దశ్యరహస్యాల వెనుక (2021) 6.పొలంగట్లవెంట(2025). వీటితో పాటు అనేకగ్రంథాలకు సంపాదకత్వం వహించారు. మాధవరావు కవిత్వ జీవితం ప్రపంచీకరణ కాలంలోనే మొదలై సాగుతున్నది. అస్తిత్వ ఉద్యమ కాలంలో ఆయన కవిగా పుట్టి ఎదుగుతున్నారు. ‘మొదటి కావ్యం’ నుంచి ‘పొలంగట్ల వెంట’ దాకా మనం జాగ్రత్తగా గమనిస్తే మాధవరావు తనను తాను నిరంతరం శిల్పీకరించుకుంటున్నారని అర్థమౌతుంది. వర్తమాన సామాజిక వాస్తవికతను తనదైన విమర్శనాత్మక గొంతుకతో తనదైన దీక్షతో అభివ్యక్తం చేసుకుంటూ వస్తున్నారు. ఇంటిపేరు ‘బండ్ల’ అయినా, ఆయన కవిత్వాన్ని బండ్లకెత్తలేదు. కవిగా ఆయన పరిమితవాది. ఆయన తాజాకావ్యం ‘పొలంగట్ల వెంట’. రైతు కుటుంబం నుంచి వచ్చిన కవి పెట్టే కావ్య శీర్షిక అది. 50కవితల కావ్యంలో ఆయన వర్తమాన సామాజిక దర్శనం మనకు కనిపిస్తుంది. ఆధునిక కవులకు ఉండవలసిన లక్షణాలలో మొదటిది రాజకీయదక్పథం. చాలా సౌమ్యుడిగా కనిపించే మాధవరావులో “నేరం ఎప్పటికీ రాజ్యానిదే”. (పు29) అనగలిగిన రాజకీయ నేత్రం ఉంది. “కాలం ఏదైతేనేం పోరాటం ఒక్కటే నిలిచేది” (పు37) అనగలిగిన చేవ ఆయనలో ఉంది. “మాటల్ని నిషేధించినవాడు వినడానికి ఇష్టపడడు” (పు47) అన్న కవిది అధిక్షేప కంఠస్వరం.
దేశాన్ని ఇప్ప్పుడొక మాయపొర కమ్మేసింది
స్వేచ్ఛ పట్ల విశ్వాసం లేని గుంపు
తెల్లోడికి ఊడిగం చేసిన గుంపు
దేశపు స్వాతంత్య్రంలో పాలు పంచుకోని గుంపు
ఇప్ప్పుడు అధికారపీఠంపై
విన్యాసాలు చేస్తోంది (పు76) అన్న కవిది స్వచ్ఛమైన రాజకీయ కంఠస్వరమే. వర్తమాన రాజకీయాలలో పెరిగిపోయిన మాటల ఆర్బాటాన్ని ప్రజా దక్పథం గల కవులెవరూ హర్షించరు. ప్రపంచీకరణ యుగం ఆకర్షణీయమైన నినాదాలతో ప్రజల్ని వంచించడమే గొప్ప పరి పాలనగా చెలామణి చేస్తున్నది. ఏ యెండకా గొడుగు పట్టే ఆషాఢభూతుల కేళీకలాపంగా ప్రపంచీకరణ రూపొందిస్తున్నది. నిత్య వేషధారి మొదలుపెట్టిన మాటల మాయాజాలానికి అంతం లేకుండా ఉంది (పు03)
అన్నది కవిగా మాధవరావు ఆవేదన. శాస్త్ర సాంకేతిక విప్లవాల యుగంలో పాలకులు మతాన్ని నెత్తిన మోయడం వైరుధ్యమేకాదు, విషాదం కూడా. దేశపు మహానగరంలోమొలుస్తున్న పీఠాలు. (పు73) అన్న కవిది భౌతికవాదమై మతతత్త్వాన్ని నిరసిస్తున్నది. ప్రజాదక్పథం గల కవులు మనుషులు కత్రిమంగా మరణించడాన్ని సహించలేరు. రైతు కుటుంబం నుంచి పుట్టుకొచ్చిన Å£వులు రైతులను గురించి రాయకుండాఉండరు. రైతుల మరణాలను అసలు ఉపేక్షించరు. మాధవరావు రైతుబిడ్డ. మట్టిదాహం, మాటకాంతం, పొలంగట్ల వెంట వంటి కవితలో రైతు శ్రమను చిత్రించి, ఆ శ్రమ వధా అయిపోవడం పట్ల ఆవేదన చెందారు. “సరళరేఖగా కొనసాగాల్సిన కొండ్ర వంకర టింకరగా సాగుతోంది.” అనే మన దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందనీ అర్థం. ఆరుగాలంపు పంట ఆరుకాలాలు కంచంలో అన్నమవుతుందో లేదో (పు111)
ఈ వ్యాసం పాఠకులకు రైతు జీవిత ప్రకంపనా లను చూపించి ఆందోళనకు గురి చేస్తుంది.
మన సమాజంలో, మన జీవితంలో కల్తీ విడదీయరాని భాగంగా ఎప్పటి నుంచో ఉంది. అయితే ప్రపంచీకరణ కాలంలో కల్తీది పైచేయి అయింది. ప్రతి రంగంలోనూ కల్తీనే.
కారణాలేమైతేనేం
కల్తీ మద్యమో కల్తీ ఎరువులో
తెగిన దారప్పోగులో
అతనలా శ్మశానం కేసి సాగిపోతూనే ఉంటాడు (పు57) వర్తమాన సమాజ కల్తీ సన్నివేశాన్ని కవి కళ్లముందు నిలిపాడు. ద్వంద్వ ప్రమాణాలు అసమ సమాజానికి ప్రధాన లక్షణం. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థలో మనిషిలో హిపోక్రసీ (ద్వంద్వ ప్రవత్తి) ప్రధానంగా కనిపిస్తుంది. ఇది ఆత్మవంచనే కాదు, పరవంచన కూడా. ప్రపంచీకరణ ఈ ద్వంద్వ ప్రవత్తిని విపరీతంగా పెంచి పోషిస్తున్నది. మేధావి వర్గానికి చెందిన కవి ఈ రుగ్మతను ఎండగట్టక మానడు. మాధవరావు ‘లోపలి ముఖం’, ‘ఇప్ప్పుడు వీస్తున్న గాలి’ వంటి కవితలలో నేటి సమాజంలో కనిపించే రెండు ముఖాలను ఆవిష్కరించారు. ఇక్కడ ఒక్కో ముఖం ఒక్కో అబద్ధాన్ని పులుముకొనుంది (పు44)
మనుషులలో కనిపించే ముసుగు చూసేవారిని భయవిహ్వలులను చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ‘లోపలి ముఖం’ కవిత చదివినప్ప్పుడు చాలాకాలం క్రితం సి.నారాయణరెడ్డి రాసిన ‘పట్టుకుంటే లక్ష’ అనే కవిత గుర్తుకొస్తుంది. ఇప్ప్పుడు ఎవరైనా చేస్తున్నది, చేయవలసింది కవి చెప్పినట్లు ఎవరి ముఖాలను వాళ్లు వెతుక్కోవడమే. ప్రపంచీకరణ మనల్ని మనం కాకుండా చేస్తున్నది. మనభాష, మన వేషం, మన తిండి, మన మనస్సు, మన మెదడు మనవి కాకుండా పోతున్నాయి. జాతీయత వికత రూపం తీసుకొని సంకుచితం అవుతున్నది. నినాదాలకూ నిజానికీ పొంతన లేకుండా పోతున్నది. మానవ సంబంధాలు, ముఖ్యంగా కుటుంబ సంబంధాలు కత్రిమంగా, వికారంగా తయారవుతున్నాయి. ప్రపంచీకరణ మన దేశ ఎల్లలు దాటుకొని వచ్చి, మన దాంపత్యంలోకి, మన కుటుంబాలలోకి దూరి వచ్చేసింది.
అమ్మా, నాన్న, చెల్లి, అన్న, కొడుకు, భార్య
అంతా ఎవరెవరో
సొంత ముఖాల్ని దాచేసుకొని
పరాయి ముఖాలతో
ప్రదర్శన రక్తి కట్టిస్తున్నారు (పు97) అని కవి ఒక వ్యాసంలో ప్రపంచీకరణ దుష్పరిణామాలను బొమ్మ కట్టించారు. సినిమా డైలాగులు ‘ఆణిముత్యాల్లా’ రాజకీయాలలోకి చొచ్చుకొచ్చి ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే అవి అహంభావం తలపిస్తున్నాయి గానీ, రాజకీయా చరణలో కనిపించడం లేదు. ‘తగ్గేదేలే’ కవిత ఈ వాస్తవానికి అక్షరరూపం. మాధవరావు “ఆమె నడుస్తూనే ఉంది” కవితలో ఒక వ్యవసాయ మహిళను చిత్రించారు. వ్యవసాయ కుటుంబంలో మహిళ జీవితాన్ని ఒక నడకగా ఆయన భావించారు. తన పొలంలో పనిచేసుకునే మహిళ రాజకీయ కారణాల వలన రాష్ట్రంలో వచ్చిన మార్పుల వలన, ఆమె తన వంటి అనేక మsది కోసం నడక సాగించటం ఈ కవితలో వస్తువు. భూమి ఆహారపంటలు పండించుకునే దశ నుంచి వ్యాపారవస్తువుగా మారేదశకు చేరుకున్న ప్ప్పుడు ఆమెచేసిన తిరుగుబాటును కవి వర్ణించాడు. తిరుగుబాటు శ్రామిక వర్గ మహిళను వర్ణించిన మాధవరావు, స్త్రీ మీద కూడా స్త్రీపురుష సంబంధ దష్టికోణం నుంచి ‘ప్రాణ బిందువు’ కవిత రాశారు. స్త్రీని చంపడంలోని దుర్మార్గాన్ని ఎత్తిచూపారు. నీలో సగమై నిలవాల్సిన దాన్ని కాలరాయడం నీ మగత్వానికి ప్రతీక (పు32)
మాధవరావు కవిత్వం రాస్తున్నప్ప్పుడు తాను కవినని, తాను చేసేపని కవిత్వ రచన అని బాగా జ్ఞాపకముంటుంది. ఆ జ్ఞాపకాన్ని ఆయన కవితలుగా కూడా మలిచారు. గన్నుకు పెన్నుకు గల తేడాను చెబుతూ…
రేపటిని కలగనడం అక్షరానికే తెలుసు
అక్షరాలు మాత్రమే ఆయుధాలు అవ్వాల్సిన చోట
తుపాకి మొనకు అంటిన రక్తం
యుద్ధ విరామాన్ని ప్రకటించాల్సిందే (పు` 116)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *