కళాజ్యోతిలో పురాతన నాణ్యముల ప్రదర్శన – Visalaandhra


రాయలసీమ నాణెముల సేకరణ సంఘం అధ్యక్షులు నాగరాజారావు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కళాజ్యోతి వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 11వ తేదీ నుండి 12వ తేదీ వరకు రెండు రోజులపాటు పురాతన నాణెముల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రాయలసీమ నాణ్యముల సేకరణ సంఘం అధ్యక్షులు కేహెచ్ నాగరాజరావు, కార్యదర్శి వి విష్ణు భగవాన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రకు సజీవ సాక్షాలు ఈ చారిత్రక నాణెములు అని తెలిపారు. తొలి తెలుగు శాసనమును క్రీస్తు శకం 575లో రేనాటి చోళ రాజు, ధనుంజయ ఎరికల్ ముత్తు రాజు వేయించడం జరిగిందన్నారు. ఈ శాసనం కడప జిల్లాలోని కలమల్ల గ్రామంలో లభ్యమయిందని తెలిపారు. దేశవ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాలలో విద్యాసంస్థల ఆహ్వానం మేరకు ప్రపంచ దేశాల నాణ్యములు నోట్లు వివిధ రాజుల కాలం నాటి పురాతన నాణెములను ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు విద్యార్థులు విజ్ఞానము కొరకు క్రీస్తుపూర్వం క్రీస్తు శకం వరకు వినియోగములోని నాణ్యములతో పాటు ఇండో గ్రీకులు ఇండో సాసానియన్ రాజులు కోటిలింగాల నాణ్యములు శాతవాహనులు ఇచ్చువాక్కులు, సెబికా రాజులు హిరణ్యక ఆనంద గోత్రికులు గుప్తులు విష్ణు కుండీనులు మగధరాజులు పల్లవులు జోలులు ఉజ్జయిని రాజులు తదితరులు వారి కాలము నాది నాణ్యములు ప్రదర్శనలో ఉంటాయని తెలిపారు. ఈ ప్రదర్శనలో సుమారు 250 దేశాలకు పైగా నాణ్యములు, ప్రపంచ దేశాల నోట్ల ప్రదర్శన, మొదటి, రెండవ ప్రపంచ యుద్ధం కాలమనాటి నోట్లు ప్రదర్శనలో ప్రతి ఒక్కరూ వీక్షించవచ్చునని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *