కన్న కొడుకుపై కర్కశం.. చిన్న తప్పుకు అట్లకాడతో వల్లంతా వాతలు.. బాబోయ్ దారుణం..! child abuse case Kakinada. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

కాకినాడ జిల్లా వొమ్మంగిలో తండ్రి పెండ్యాల చంద్రయ్య ఏడేళ్ల నిహాల్‌ను క్రూరంగా కాల్చి గాయపరిచాడు, బాలుడు ప్రాణాపాయంలో, ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు

కన్నకొడుకును ముఖంనిండా వేడివేడి అట్లకాడతో వాతలు పెట్టిన తండ్రి
కన్నకొడుకును ముఖంనిండా వేడివేడి అట్లకాడతో వాతలు పెట్టిన తండ్రి

చిన్న తప్పు చేసినందుకు తల్లిదండ్రులు పిల్లలను మందలించడం సహజమే. కానీ ఆ కోపం హద్దులు దాటితే అది ఎంత భయంకరంగా మారుతుందో కాకినాడ జిల్లాలో జరిగిన ఘటన మళ్లీ చూపించింది. అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారి చేసిన చిన్న తప్పు, అతని జీవితాన్ని నరకయాతనగా మార్చింది. కన్న కొడుకుపై తండ్రి చూపించిన కిరాతకత్వం ఇప్పుడు ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం వొమ్మంగి గ్రామానికి చెందిన నిహాల్ అనే చిన్నారి ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఉండగా, వేరే వ్యక్తికి చెందిన ఆటో షీట్ కవర్‌ను కోసి ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తండ్రి పెండ్యాల చంద్రయ్యకు తెలియగానే ఆవేశం అదుపుతప్పింది. గాఢ నిద్రలో ఉన్న తన కొడుకును లేపి విచక్షణ లేకుండా దాడి చేయడం ప్రారంభించాడు.

అక్కడితో ఆగకుండా, అట్లకాడను వేడి చేసి చిన్నారి ముఖం, శరీరంలోని అనేక భాగాల్లో కాల్చి వాతలు పెట్టాడు. తాను ఏం చేస్తున్నాడో అన్న ఆలోచన కూడా లేకుండా అమానుషంగా ప్రవర్తించిన తండ్రి చేతిలో చిన్నారి నరకయాతన అనుభవించాడు. తీవ్ర గాయాలతో చిన్నారి పరిస్థితి విషమించడంతో వెంటనే ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.

అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత పరిస్థితి కాస్త ఆందోళనకరంగా మారడంతో కాకినాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన గురించి తెలిసిన గ్రామస్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిన్న విషయానికి ఇంతటి దారుణానికి పాల్పడటం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను సరిదిద్దాల్సిన బాధ్యత ఉన్న తండ్రి, ఇలా హింసించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో సమాజంలో పిల్లలపై జరుగుతున్న హింసపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ ఘటనపై ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. కన్న కొడుకుపై ఇంతటి పైశాచికానికి పాల్పడిన తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒక చిన్నారి చేసిన చిన్న తప్పు, అతనికి ఇంతటి శిక్షగా మారడం అందరినీ కుదిపేస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *