‘వన్ బ్యాటిల’ ఉత్తమ చిత్రంతో పాటు 6 అవార్డులు
లాసఏంజెల్స్: 98వ ఆస్కార్ (2026) అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో కనుల పండువగా జరిగింది. ఈ ఏడాది ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర’ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచి సత్తా చాటింది. ఈ సినిమా ఏకంగా 6 విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలను కైవసం చేసుకుంది. రికార్డు స్థాయిలో 16 నామినేషన్లు పొందిన ‘సిన్నర్స’ చిత్రం కేవలం నాలుగు అవార్డులతోనే సరిపెట్టుకుంది.
పాల్ థామస్ అండర్సన్ దర్శకత్వం వహించిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర’ చిత్రానికి ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే (పాల్ థామస్ అండర్సన్), ఉత్తమ సహాయ నటుడు (సీన్ పెన్) అవార్డులు దక్కాయి. మరోవైపు, ‘సిన్నర్స’ చిత్రంలో నటనకు గాను మైఖేల్ బి.జోర్డాన్ ఉత్తమ నటుడిగా నిలవగా, ‘హామ్నెట’ చిత్రానికి జెస్సీ బక్లీ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. లియోనార్డో డికాప్రియో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర’లో ప్రధాన పాత్ర పోషించాడు. ఈసారి ఆస్కార్స్‌లో కొన్ని చారిత్రక ఘట్టాలు చోటుచేసుకున్నాయి. ‘సిన్నర్స’ చిత్రానికి గాను అటమ్ డ్యురాల్డ్ అర్కాపా ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును గెలుచుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా, ఈ ఏడాదే కొత్తగా ప్రవేశపెట్టిన ఉత్తమ కాస్టింగ్ విభాగంలో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర’ చిత్రానికి కాసాండ్రా కులుకుండిస్ తొలి అవార్డును అందుకున్నారు. ప్రముఖ వ్యాఖ్యాత కోనన్ ఓ’బ్రియన్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ వేడుకలో 2025లో విడుదలైన చిత్రాలకు పురస్కారాలు అందించారు.
ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
ఈ ఏడాది భారతీయ అభిమానులకు ఈ వేడుక మరింత ప్రత్యేకంగా మారింది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రజెంటర్‌గా ఈ వేదికపై మెరవగా, వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కుమార్తె యువ వ్యాపారవేత్త ఈషా అంబానీ తన విలక్షణమైన స్టైల్‌తో కెమెరా కళ్లకు పనిచెప్పారు. అంతర్జాతీయ వేదికపై భారతీయ ప్రతిభ, అందం మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఆస్కార్ వేదికపై ప్రజెంటర్‌గా కనిపించడమే కాకుండా, రెడ్ కార్పెట్‌పై తన స్పెషల్ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె డియోర్ సంస్థ రూపొందించిన వైట్ గౌనును ధరించారు. ఈ దుస్తులకు ఉన్న హై స్లిట్, ఫెదర్ లాంటి డీటెయిలింగ్ ఆమె లుక్‌కు మరింత రాయల్ టచ్ ఇచ్చింది. వజ్రాల హారంతో పాటు పాయింటెడ్ బ్లాక్ హీల్స్‌ను జత చేసి ప్రియాంక చాలా సింపుల్‌గా, ఎంతో గ్రేస్‌ఫుల్‌గా కనిపించారు. ఆమె భర్త నిక్ జోనాస్ కూడా క్లాసిక్ బ్లాక్ వెల్వెట్ టక్సేడోలో ప్రియాంకకు సరైన జోడీగా నిలిచారు.


