విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 44 కార్మికచట్టాలను అమలుచేసి ,నాలుగుకోడ్‌లను రద్దుచేయాలని ,వీవీజీ రామ్‌జీ చట్టంను రద్దుచేయాలని,కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేఖ విధానాల ప్రతిపాధించిన బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. గురువారం కేంద్రకార్మిక సంఘాలు పిలుపు మేరకు కర్నూలులో కార్మిక, కర్షక సంఘాలు నగరంలో కదం తొక్కారు.కర్నూలు జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహంచి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐటీయూసీ నగర కార్యదర్శి జీ చంద్రశేఖర్, సీఐటీయూ నాయకులు నరసింహులు అద్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, అనుబంధాల సంఘాలు ,ఏపీరైతుసంఘం, ఏపీ వ్యవసాయకార్మికసంఘాల, ఐఎఫ్టీయూ కార్మికసంఘాల నాయకులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చేతి వతి ్తదారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కె రామాంజనేయులు, ఏపీ వ్యవసాయకార్మికసంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి అవుల శేఖర్, ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాధం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్ మునెప్ప, ఏపీ రైతుసంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అంజిబాబు , ఐద్వా నాయకురాలు నిర్మలమ్మ , ఏఐటీయూసీ సీనియర్ నాయకులు మనోహర్‌మాణిక్యం తదితరులు హాజరై మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దుచేసి నాలుగుకోడ్‌లను అమలు చేయడం దుర్మార్గ మన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలనుప్రైవేటీకరణ చేయడం, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించక పోవడం వలన దేశంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు.డిల్లీల రైతుల ఆందోళల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలుచేయకుండా రైతులను మోసం చేసిందన్నారు.
వీవీజీ రామ్‌జీ చట్టంను రద్దుచేసి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హమీచట్టంను తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎన్ లెనిన్‌బాబు, రామకష్ణారెడ్డి, ఏపీ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి నభిరసూల్, ఏపీ వ్యవసాయకార్మికసంఘం జిల్లా అద్యక్షులు నాగేంద్రయ్య, ఏఐటీయూసీ నగర అద్యక్షులు వెంకటేష్, ఏఐఎసఎఫ్ జిల్లా అద్యక్షకార్యదర్శులు సోమన్న, షాబీర్‌బాష, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు, ఏపీ మహిళాసమాఖ్య నగర కార్యదర్శి భారతి,ఐఎఫ్టీయూ నాయకులు భాస్కర్, రైతుకూలీసంఘం నాయకులు సుంకన్న, అలివేళమ్మ, రఘబాబు, సునిల్‌కుమార్, రామ్రాజ్,హనుమారెడ్డి , డి శ్రీనివాసరావు, మహేష్, ఆశావర్కర్స్యూనియన్ నాయకులు రమిజాభీ తదితరులు పాల్గొన్నారు.


