ఒకపక్క వర్షాల సూచన.. మరోపక్క భగ్గుమంటున్న ఎండలు.. ఏపీలో వాతావరణ శాఖ అలర్ట్..! Light rains in Uttar Coastal temperatures up to 45C in Rayalaseema. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. రాయలసీమలో ఉష్ణోగ్రతలు 40-45°C వరకు చేరే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఏపీలో ఈ ప్రాంతాలకు  వర్షాలు..! మిగతా ప్రాంతాలకు ఎండలు
ఏపీలో ఈ ప్రాంతాలకు  వర్షాలు..! మిగతా ప్రాంతాలకు ఎండలు

ఆంధ్రప్రదేశ్‌లో భానుడు తన ప్రతాపాన్ని మరింతగా చూపిస్తూ ఎండలను తీవ్రతరం చేస్తున్నాడు. ఇప్పటికే పలుచోట్ల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు ఎండలకు విలవిలలాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ నుంచి ఒక చిన్న ఊరటనిచ్చే సమాచారం వెలువడింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల ఈ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.

వాతావరణ శాఖ వివరాల ప్రకారం మున్నార్ గల్ఫ్ నుంచి తమిళనాడు, కర్ణాటక మీదుగా ఒక ద్రోణి ఏర్పడి కొనసాగుతోంది. ఈ ద్రోణి సగటు సముద్రమట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాల మీదుగా దక్షిణ-నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని వెల్లడించారు. ద్రోణి ప్రభావం కారణంగా రాబోయే రెండు రోజుల పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇక కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన చిరు జల్లులు కూడా పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఉత్తర కోస్తాలో మాత్రమే ఈ వర్షాల ప్రభావం కొంత మేర కనిపించే అవకాశం ఉండగా, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణం కొనసాగనుందని చెప్పారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వేడి మరియు తేమ అధికంగా ఉండే వాతావరణం నెలకొనే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం స్వల్ప ఉపశమనం లభించినా వచ్చే రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా మార్చి చివరి వారానికి చేరుకునే సరికి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.

ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అక్కడ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం లేకపోతే బయటకు రావద్దని, వీలైనంతవరకు చల్లటి ప్రదేశాల్లోనే ఉండాలని సూచిస్తున్నారు. అదేవిధంగా ఏప్రిల్, మే నెలల్లో వడగాల్పులు కూడా తీవ్రంగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *