ఐఏఎస్, ఐపీఎస్‌లను మారిస్తే ఫలితాలు రావు


. కీలకశాఖల అధికారుల మార్పుతో రాష్ట్రానికి నష్టం
. రేవంత్ మేనల్లుడి మనుషులు అక్రమ మైనింగ్
. దందా నడుపుతున్న మంత్రి పొంగులేటి సంస్థ
. నేడు మైనింగ్ ప్రాంతాలకు నిజనిర్ధారణ కమిటీ: హరీశ్ రావు

విశాలాంధ్ర – హైదరాబాద్ : ఐఏఎస్, ఐపీఎస్‌లను తరచూ మార్చడం వల్ల ఫలితాలు రావని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఐదుసార్లు భారీగా మార్పులు చేర్పులు జరిగాయన్నారు. మీడియాతో బుధవారం ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ కు పాలన చేతగావడం లేదని అర్థం అవుతుందని, విభాగ అధిపతులు సగటున ఎనిమిది నెలలు కూడా పని చేయడం లేదంటే … ఇదే ఆయన పాలనకు నిదర్శనమన్నారు. విద్యుత్ శాఖలో రెండేళ్ల కాలంలో ఐదుగురు అధికారులు మారారని, దీనివల్ల విద్యుత్ శాఖలో తీవ్ర ప్రభావం చూపిందన్నారు. బదిలీలతో విద్యుత్ శాఖ అతలాకుతలం అయిందని, అవినీతిమయం అయిందని పేర్కొన్నారు. సింగరేణిలో నలుగురు, జీహెచఎంసీలో నలుగురు, ఐ అండ్ పీఆర్‌లో నలుగురు, విద్యాశాఖలో నలుగురు, ఆరోగ్య శ్రీ లో ఎనిమిది మంది, పంచాయతీ రాజ్ శాఖలో నలుగురు, మున్సిపల్ శాఖలో ఐదుగురు, ఐటీలో ముగ్గురు, మైనింగ్‌లో ఆరుగురు, నేషనల్ హెల్త్ మిషన్‌లో ముగ్గురిని మార్చారని వివరించారు. ఈ విధంగా మార్చుకుంటూ పోతే పాలన ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. పాలన అంటే రేవంత్ రెడ్డికి హాస్యం అయిపోయిందని దుయ్యబట్టారు. 140 మంది ఐఏఎస్‌లను బదిలీ చేయడంతో పాటు 20 మంది కలెక్టర్లను మార్చారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలో నలుగురు కలెక్టర్లు మారారని, దిల్లీతో సమన్వయం ఉండాల్సిన కీలక శాఖల్లో అధికారులను తరచూ మార్చడం వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని అభిప్రాయపడ్డారు. 12 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పదవీకాలం పెంచారని, వందల మంది ఇంజినీర్ల కు పదవీ కాలాన్ని పెంచుతూ పోతున్నారని ఆరోపించారు. బీఆరఎస్ హయాలో అధికారుల పదవీ కాలం పొడిగింపుపై ఇదే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు… మరి ఇప్ప్పుడు వాళ్లు చేస్తున్నదేమిటని నిలదీశారు. యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణ టెండర్లలో ఐదు శాతం ఎక్కువకు ఇస్తున్నారని, వీటన్నిటి వివరాలు త్వరలో బయట పెడతానని హెచ్చరించారు. ఇంజినీరింగ్ శాఖలో పదవీ విరమణ చేసిన అధికారులు కీలక పదవుల్లో ఉండటం వల్ల అవినీతి ఎక్కువ జరుగుతోందని, అధికార్లను తరచూ బదిలీ చేయడం వల్ల రాష్ట్రానికి అవార్డులు కూడా రావడం లేదన్నారు. కేసీఆర్ హయంలో రాష్ట్రం మోడల్ స్టేట్ అయిందంటే దానికి అధికారులకు స్వేచ్ఛ నిచ్చి పని చేయించారని పేర్కొన్నారు. తమ అక్రమాలకు అధికారులు సహకరించడం లేనందుకే సీఎం వారిని బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. 20 శాతం జీవోలు ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు, 80 శాతం జీఓలు ఆఫ్ లైన్లో ఉంచుతున్నారని విమర్శించారు. మా ఎర్రోళ్ల శ్రీనివాస్ హై కోర్టు కు వెళితే నాలుగు వారాల్లో జీవో లు ఆన్ లైన్లో పెట్టాలని ఆదేశించిందని, కోర్టు ఆదేశించినా జీవో లు ఆన్ లైన్ లో పెట్టడం లేదన్నారు. రేవంత్ రెడ్డి మేనల్లుడి మనుషులు నియో పొలీస్‌లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. మొబైల్ క్రషింగ్ ప్లాంట్ కు మాత్రమే నిబంధనలుండగా ఫిక్స్డ్ క్రషింగ్ ప్లాంట్ నియోపొలీస్ లో పెట్టారని తెలిపారు. ల్యాండ్ లీజుకు ఇస్తే ఆరు నుంచి ఏడు శాతం ఫీజు కట్టాలని, లేఖలో పది ఎకరాలు ఇస్తే 15 ఎకరాల్లో మైనింగ్ జరుగుతోందని వెల్లడించారు. 15 లక్షల క్యూబిక్ మీటర్ల బండకు ఫీజు ఎగ్గొట్టారని, రెడీమిక్స్ కు అనుమతి లేకున్నా నడుపుతున్నారని తెలిపారు. పటాన్ చెరు ఎమ్మెల్యేకు మైనింగ్ కంపెనీకి పెనాల్టీ వేశారని అన్నారు. ఓ ఆర్ ఆర్ కు కిలోమీటర్ దూరంలో ఎలాంటి కంపెనీ, మైనింగ్ పెట్టవద్దని జీఓ ఉందని కానీ మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్‌కు ఎలాంటి అనుమతులు లేకుండా రాజేంద్రనగర్ లో మైనింగ్ దందా నడుపుతుందని ఆరోపించారు. నిజానిర్ధారణ కోసం బీఆరఎస్ బృందం గురువారం వెళ్తుందని స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై వేచి చూద్దామన్నారు. తాను మంత్రిగా ఉన్నప్ప్పుడు హెల్త్ కార్డు జీఓ ఇచ్చాను, కానీ ఈ ప్రభుత్వం జర్నలిస్టులకు పెట్టిన రూ. 16 కోట్ల బడ్జెట్ కు ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఎడ్యుకేషన్ పాలసీని వెబ్ సైట్ నుంచి ఎందుకు తీసివేశారని నిలదీశారు. అసెంబ్లీలో ఇద్దరు సెక్రటరీల పాలసీ ఎప్ప్పుడూ లేదని, ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్టుపై బీఆరఎస్ మొదట మాట్లాడిందని, ప్రతిపక్షంగా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడంలో సఫలం అవుతోందన్నారు.

The post ఐఏఎస్, ఐపీఎస్‌లను మారిస్తే ఫలితాలు రావు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *