ఏపీ ప్రజలకు శుభవార్త.. ‘మన మిత్ర’ వాట్సాప్ చాట్‌బాట్‌ ప్రారంభం | తెలంగాణ వార్తలు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు వాట్సాప్ సేవల్ని మరింత విస్తరిస్తోంది. 9552300009 నంబరు ద్వారా ఇకపై మనకు ‘మన మిత్ర’ అనే వాట్సాప్ చాట్‌బాట్‌ ఉంటుంది. అది మనిషిలా మనతో మాట్లాడుతుంది. దాన్ని వాడుకొని మనం రకరకాల సర్వీసులను పొందవచ్చు. మన డౌట్స్ అడగవచ్చు. ఏ సేవ ఎలా పొందాలో తెలుసుకోవచ్చు. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, ఆధార్ లేదా eKYC చేయించుకున్న ఏపీ ప్రజవలు ఈ సేవలు పొందగలరు. ఈ చాట్‌బాట్‌ని ఎలా వాడాలో, 1000కి పైగా సేవల్ని మొబైల్ ద్వారా ఎలా పొందాలో సచివాలయ ఉద్యోగులు చెబుతారు. ఈసారి వాళ్లు ఇంటికి వచ్చినప్పుడు అడగవచ్చు. లేదా మనమే సచివాలయానికి వెళ్లి అడగొచ్చు. మనకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత.. ఆధార్ ద్వారా మన పేరును నమోదుచేస్తారు. అప్పటి నుంచి ఈ సేవను వాడుకోవచ్చు. ఈ చాట్‌బాట్ కారణంగా ఇక మనం ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం దాదాపు ఉండదు.

ఇవాళ ఏమున్నాయి?

ఇరాన్ యుద్ధానికి 42 రోజులు పూర్తి అయ్యాయి. నేడు 43వ రోజు కొనసాగుతోంది. NASA ఆర్టెమిస్ 2 మిషన్ భూమికి చేరుతోంది. నేడు గుంటూరు జిల్లాపై సీఎం చంద్రబాబు సమీక్ష జరుపుతారు. విజయవాడలో జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఇస్లామాబాద్‌లో నేటి అమెరికా, ఇరాన్ చర్చలపై ప్రతిష్టంభన ఉంది. నేడు ఇబ్రహీంపట్నంకి కేటీఆర్ వెళ్తారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవుతారు. IPL – నేడు పంజాబ్ vs హైదరాబాద్ మ్యాచ్ మధ్యాహ్నం 3.30కి ఉంది. ఢిల్లీ vs చెన్నై మ్యాచ్ రాత్రి 7.30కి ఉంది. ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కింద ఉన్నాయి చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *