అప్రమత్తంగా లేకపోతే అకౌంట్లు ఖాలీ…
పోలవరం: సైబర్ నేరగాళ్లు ఆగడాలు రానురాను పెచ్చుపెరుగుతున్నాయి. నేరగాళ్ళు రోజురోజుకీ కొత్త దారులు వెతుక్కుంటున్నారు. తప్ప్పు తెలిసినంత వరకు ఇటువంటి నేరాలు బయకురావడం లేదు. ఇటీవల ఈ మధ్య ఓ మాజీ ఐపీఎస్ భర్యను షేర్లు పేరు చెప్పి బురిడీ కొట్టించి సుమారు మూడు కోట్లు వరకు కాజేశారు. రెండు రోజుల కిందటే ఓ మాజీ డీజీపీ మనమరాలు సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. తాజాగా రాష్ట్రంలోని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ఆయన బ్యాంకు అకౌంట్ నుంచి రూ.12 లక్షలు కాజేశారు. ఆర్టీఏ చలానా పేరుతో వచ్చిన లింక్‌ను ఎమ్మెల్యే క్లిక్ చేశారు. దీంతో బ్యాంకు ఖాతాలోని నగదు మాయమైంది. మోసపోయినట్లు గ్రహించిన ఎమ్మెల్యే బాలరాజు… జీలుగుమిల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే… ప్రభుత్వం, సైబర్ సెక్యూరిటీ సిబ్బంది అనేక విధాలుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ నేరగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగులు, విద్యావంతులు, వ్యాపారులను నేరగాళ్లు టార్గెట్ చేసుకుంటున్నారు. వారి అవసరాలను బట్టి ప్లాన్ చేసి మరీ దెబ్బ కొడుతున్నారు. ఏది ఏమైనా అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్‌ను లిఫ్ట్ చేసినా, మెసేజ్‌లు, మెయిల్స్ ఓపెన్ చేసినా ఇటువంటి సంఘటనలు ఎదురవక తప్పదు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం. ఏ మాత్రం వాళ్లకు స్పందించినా ఖాతాలు ఖాళీ అవకతప్పదు.
The post ఎమ్మెల్యే బాలరాజును బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు appeared first on Visalaandhra.


