ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు


కాంగ్రెస్ పార్టీ నాయకులు తుప్పర్తి పరమేష్

విశాలాంధ్ర ధర్మవరం; ఆర్ డి టి స్వచ్ఛంద సేవా సంస్థకు ఎఫ్ సి ఆర్ ఏ ను రెన్యువల్ చేయకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని, అటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కు కూటమి ప్రభుత్వానికి లేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు తలమానికం పేద ప్రజల గుండెచప్పుడు అయిన ఆర్ డి టి విస్మరిస్తున్న బిజెపి ప్రభుత్వం, ఇక్కడ ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు చొరవ తీసుకొని ఆర్డిటిని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉందని వారు స్పష్టం చేశారు. ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్య కుమార్ యాదవ్ పట్టించుకోవడంలేదని, ఇది చాలా బాధాకరమని వారు తెలిపారు. లేనియెడల ప్రజా ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని తెలిపారు. ఆర్డిటి పరిరక్షణకు ధర్మవరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో భాగంగా లక్ష పోస్టల్ కార్డులను రాష్ట్రపతి కు పంపి జన చైతన్యంతో ఆర్డిటిని కాపాడుకుంటామని వారు తెలిపారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి పేద ప్రజలకు అండగా నిలవాలని వారు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *