ఎన్టీఆర్ వైద్య సేవ కింద పేదవారికి మెరుగైన చికిత్సలను అందించాలి


. రోగి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి
. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి…

విశాలాంధ్ర – భీమవరం : రోగి వద్దనుండి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం లో శనివారం ఎన్టీఆర్ వైద్య సేవ ఫిర్యాదులపై డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులలో అందుతున్న వైద్య సేవలు, రోగుల నుండి వచ్చిన ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలపై రోగుల నుండి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించడం జరిగిందని, ప్రస్తుతం రోగుల నుండి కొత్తగా ఎటువంటి ఫిర్యాదులు నమోదు కాలేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ కి సంబంధించి ప్రైవేటు ఆసుపత్రులు.. రోగులకు క్యాష్ లెస్ వైద్య సేవలు అందించాలన్నారు. రోగులకు వైద్య సేవలు అందించడంలో జాప్యము చేయరాదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆస్పత్రులలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పారిశుధ్య నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.జి.గీతా బాయి, డి సి హెచ్ ఎస్ పి.సూర్యనారాయణ, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డా.కీర్తి కిరణ్, ఆర్కే గాయత్రి, వర్మ, ఆపిల్ హాస్పిటల్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *