ప్రైవేట్ ఆసుపత్రుల సమ్మె విరమణ.. డాక్టర్ బషీర్
విశాలాంధ్ర ధర్మవరం;; ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించవలసిన బకాయిల్లో సుమారు 1000 కోట్ల రూపాయలను 10 రోజుల్లో చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు విరమించడం జరిగిందని డాక్టర్ బషీర్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యవర్గం తెలిపిన మేరకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలుతీరులు ఆశా ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు చర్చించడం జరిగిందని ఆశ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయకుమార్ తెలపడం జరిగిందన్నారు. నెట్వర్క్ హాస్పిటల్ బిల్లులను ప్రతినెల 150 కోట్ల నుండి 170 కోట్ల వరకు క్లియర్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని వారు తెలిపారు. యూనివర్సల్ హెల్త్ స్కీమును అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించేందుకు ఆశా ప్రతినిధులు ఇతర భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ప్రతినిధులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆశా కమిటీ సంతృప్తిని వ్యక్తం చేసిందని, అయితే గత అనుభవాల దృష్ట్యా తమ ఆందోళనను తాత్కాలికంగా మాత్రమే విరమించాలని ఆశ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిందని వారు తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే తమ ఆందోళనకు దిగామని భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావతం కాకూడదని కోరడం జరిగిందని రాష్ట్ర కార్యవర్గం (ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్) తెలిపిందన్నారు.


