సమయ పాలన పాటించని ఉపాధ్యాయులు
ఉపాధ్యాయ పని తీరుపై విమర్శలు….
విశాలాంధ్ర,కదిరి : పేదరికంతోనూ,కుటుంబ సమస్యలతోనూ కొందరు చదువు మధ్యలో మానేసి డ్రాపవుట్స్ గా మిగిలిపోతున్నారు.ఇలాంటి వారికి కల్పతరువుగా ఏపీ ప్రభుత్వం ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఏర్పాటు చేసింది. అహర్లాదకరమైన వాతావరణం,ఆధునాతన వసతులు ఏర్పాటు చేసి అద్భుత ఫలితాలు సాదించాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు.పట్టణంలో అగ్నిమాపక కేంద్రం సమీపంలో గల ఏపీ ట్రైబల్ బాలికల వసతి గృహంలో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు(పదవ తరగతి మినహా)227 మంది బాలికల విద్యనుఅభ్యసిస్తున్నారు.
గత రెండు రోజులుగా ఆర్ ఓ ప్లాంట్ మరమ్మతులకు గురి కాగా ప్రిన్సిపాల్ కిరణ్మయి ట్యాంకర్ ద్వారా మంచినీరు అందించారు.అసలే ఎండల కాలం కావడంతో అవి ఏ మాత్రం తమ పిల్లలకు సరి పోవడం లేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.కొందరు తల్లిదండ్రులు,విద్యార్థి సంఘ నాయకుల ద్వారా ఆరోపణలు రావడంతో అక్కడికి విశాలాంధ్ర జర్నలిస్ట్ వెళ్లి పరిశీలించగా హాస్టల్ ఆవరణం మొత్తం చెత్త చెదారం,మిగిలిన ఆహార పదార్థాలతో, వ్యర్థ పదార్థాలతో నిండిన కాలవ అపరిశుభ్రత తాండవం చేస్తున్న విషయాన్ని ప్రిన్సిపాల్ కిరణ్మయి వివరణ కోరగా ఇప్పుడు చేయిస్తామన్నారు.ఆదివారం సాయంత్రం ఆర్ ఓ ప్లాంట్ రిపీరి చేయించామని తెలిపారు.ఉదయం 9 గంటలకు అల్పాహారం అనంతరం విద్యార్థులు.వారి వారి తరగతి గదులకు వెళ్ళాలి….కానీ తొమ్మిదిన్నర కావస్తున్న పిల్లలు వారి గదుల్లో ఉండిపోయారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాల్సిన ఉపాధ్యాయ సిబ్బంది అటువైపు అడుగులు వేయడం లేదనే విమర్శలు కలవు.ప్రిన్సిపల్ గదిలో ఏర్పాటు చేసిన విద్యార్థుల వివరాలు బోర్డు లో పిచ్చి పిచ్చి గీతలు దర్శనం ఇస్తున్నాయి. ఇదేంటని ప్రిన్సిపాల్ వివరణ కోరగా అటెండర్ కొడుకు ఇలా చేసారని చెప్పడం విధుల పట్ల వీరికున్న నిర్లక్ష్యం బయట
పడింది.ఇలాంటి వారిపై సంభంధిత అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


