‘ఉస్తాద్ భగత్ సింగ’ కొత్త పోస్టర్ సంచలనం


పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ’ చిత్రంపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లేలా కొత్త పోస్టర్ విడుదలైంది.పవన్ కల్యాణ్ హ్యాట్ ధరించి స్టైలిష్‌గా కనిపిస్తున్న పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన తక్షణమే పోస్టర్ వైరల్‌గా మారింది. పవన్ కల్యాణ్ లుక్‌కి అభిమానులు, సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. ఈ భారీ స్పందన మరోసారి చిత్రంపై ఉన్న అపారమైన క్రేజ్‌ను నిరూపించింది. ‘ఉస్తాద్ భగత్ సింగ’ నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రచార చిత్రాలు సంచలనంగా మారి, అన్ని సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతూ భారీ బజ్ సృష్టించాయి. ‘దేఖ్ లేంగే సాలా’, ‘ఆరా ఆఫ్ ఉస్తాద’ పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. పవన్ కల్యాణ్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రతి పాట పవర్‌స్టార్ ఆరాను మరింతగా ఆవిష్కరిస్తూ, అభిమానులను ఆకట్టుకుంటుంది. అన్ని వర్గాల నుంచి వెల్లువెత్తుతున్న ప్రేమాభిమానాలతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. తాజా పోస్టర్ అందరినీ విశేషంగా ఆకట్టుకొని, అంచనాలను తారస్థాయికి తీసుకెళ్లింది. ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, త్వరలోనే చిత్రానికి సంబంధించిన పవర్‌ప్యాక్డ్ 40 సెకన్ల గ్లింప్స్‌ను విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ ప్రత్యేక వీడియో ద్వారా చిత్రంలోని స్థాయి, తీవ్రత, మాస్ ఎలిమెంట్స్‌ను ప్రేక్షకులకు చూపించనున్నారు. ఈ గ్లింప్స్ అభిమానులకు అసలు సిసలైన మాస్ విందును అందించనుంది. గతంలో ‘గబ్బర్‌సింగ’తో సంచలనాలు సృష్టించిన బ్లాక్‌బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్… ‘ఉస్తాద్ భగత్ సింగ’లో పవన్ కల్యాణ్‌ను మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో చూపించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. అన్ని అంశాల మేళవింపుతో సంపూర్ణ వినోదభరిత చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో చిత్రానికి మరింత హై వోల్టేజ్ ఎనర్జీ అందిస్తున్నారు. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఉత్సాహం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ‘ఉస్తాద్ భగత్ సింగ’ మరోసారి మాస్ సినిమాకు కొత్త నిర్వచనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ‘ఉస్తాద్ భగత్ సింగ’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026, మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *