ఉమ్మడి జిల్లాల వారికి పరుగు పందెం పోటీలు


నిర్వాహకులు బాలరాజు, సాకే సాయికుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; ఉమ్మడి జిల్లాలు అయిన అనంతపురం, పుట్టపర్తి జిల్లాల వారికి ధర్మవరం మండలం లోని గొట్లూరు గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాల (మంకాలమ్మ దేవాలయం దగ్గర) మార్చి 27వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బాలరాజు, షాకే సాయికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పరుగు పందెం శ్రీరామనవమి సందర్భంగా రెండు కిలోమీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. పరుగు పందెంలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా రూ.5,016, రెండవ బహుమతిగా రూ.3,016, మూడవ బహుమతిగా రూ.2,016, నాలుగవ బహుమతిగా రూ.1,016 ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ పరుగు పందెం పోటీలకు అనంతపురం జిల్లా వారు, పుట్టపర్తి జిల్లా వారు పాల్గొనే అవకాశం ఉందని వారు గుర్తు చేశారు. మరిన్ని వివరాలకు కే. బాలరాజు సెల్ నెంబర్ 9703832 051 కు గాని, సాకే సాయి కుమార్ సెల్ నెంబర్ 6301112051 కు సంప్రదించగలరని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తి గలవారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *