–రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్
విశాలాంధ్ర ధర్మవరం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధా విధంగా కొనసాగించాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్ తెలిపారు
ఈ సందర్భంగా వారుధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి లో ఏపీవో కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కష్టజీవులకు మేలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని, 200 రోజులు పని దినాలు కల్పించి ప్రతిరోజు కూలికి 800 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వలస నివారణకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకం బి బి జి రాంజీ బిల్లును రద్దు చేయాలని, కొత్త బిల్లు అమల్లోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో చిన్నకార రైతులు మహిళలు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది అని తెలిపారు. 2004లో వామపక్షాల భాగస్వామ్యంతో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ పథకం అందుబాటులోకి తీసుకువచ్చి ,వంద రోజుల పని తీసు కోస్తే, నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా పథకానికి పేరు మార్పు చేసి రోజులు కూడా పెంచుతామని కళ్లబొళ్లి మాటలు చెబుతోంది అని వారు దుయ్య బట్టారు. ఇప్పటికే ఈ పథకంలో 100 రోజులు ఉంటే 50 రోజులు 60 రోజులు మాత్రమే పని కల్పించి, ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది అని తెలిపారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్న సన్నకారు , రైతులు వ్యవసాయ కూలీలు, మహిళలు ఉపాధి కోల్పోయి వలసలు వెళ్లే ప్రమాదం ఉంటుంది అని తెలిపారు. ఇప్పటికైనా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, మండల కార్యదర్శి బండల వెంకటేష్, సహాయ కార్యదర్శులు సాకే ఓబులేసు, సన్న పెద్దన్న,కుళ్లాయప్ప, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, సహాయ కార్యదర్శులు ఎర్రంశెట్టి రమణ, శ్రీనివాసులు, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు రామకృష్ణ, మహిళా సమాఖ్య రమీజా, జయమ్మ,నాగభూషణ, ఆదెప్ప, కేశవరెడ్డి, ఓబులేసు, సత్యప్ప, లక్ష్మీనారాయణ, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
The post ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి appeared first on Visalaandhra.


