ఉదయ్‌పూర్‌లో విజయ్-రష్మిక సందడి


హైదరాబాద్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గురువారం వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారిగా కెమెరాల కంటపడ్డారు. పెళ్లయిన మరుసటి రోజు ఈ నూతన వధూవరులు ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమై సందడి చేశారు. కొత్త పెళ్లికూతురుగా రష్మిక ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోగా, విజయ్ దేవరకొండ స్టైలిష్ ఇండో-వెస్ట్రన్ దుస్తుల్లో రాజసంగా కనిపించారు. గురువారం పెళ్లి వేడుకల అనంతరం మరుసటి రోజే ఈ కొత్త జంట ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. తమ అభిమాన జంటను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయ్, రష్మిక ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ అభిమానులకు అభివాదం చేశారు. అభిమానుల కేరింతల మధ్య ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ వారిని ఉత్సాహపరిచారు.
హైదరాబాద్ రిసెప్షన్‌కు ప్రధానికి ఆహ్వానం
విజయ్`రష్మిక దేశ రాజధాని దిల్లీలో భారత పధాని నరేంద్ర మోదీ, ీVAంమంత్రి అమిత్‌షాని మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 3న హైదరాబాద్‌లో జరగబోయే తమ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు రావాల్సిందిగా వారిని వ్యక్తిగతంగా ఆహ్వానించారు. విజయ్ దేవరకొండ, రష్మికలు ప్రధాని మోదీ, ీVAంమంత్రి అమిత్‌షాని కలిసి ఆహ్వాన పత్రికను అందజేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంటను ప్రధాని, ీVAంమంత్రి ఆశీర్వదించినట్లు తెలుస్తోంది. సినీ రంగంలో తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు తారలు, దేశ ప్రధానిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఉదయ్‌పూర్‌లో కేవలం కొద్దిమంది సన్నిహితుల మధ్యే పెళ్లి జరగగా, హైదరాబాద్‌లో జరగనున్న ఈ రిసెప్షన్‌కు రాజకీయ, సినీ,వ్యాపార రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరుకానున్నారు. ప్రధాని మోదీ ఈ వేడుకకు వచ్చే అవకాశం ఉందనే వార్తలతో ఇప్పుడు భాగ్యనగరంలో సందడి మొదలైంది.

The post ఉదయ్‌పూర్‌లో విజయ్-రష్మిక సందడి appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *