అమ్మవారి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మార్వో ఎం. రాజశేఖర్
విశాలాంధ్ర – రాజాం : ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో జరుగనున్న 100వ వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను రాజాం ఎమ్మార్వో ఎం. రాజశేఖర్ శ్రద్ధగా పరిశీలించారు.
జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసర ప్రాంతాలు, రహదారులు, తాగునీటి సదుపాయం, పారిశుధ్య ఏర్పాట్లు, విద్యుత్ వెలుగులు తదితర అంశాలను ఆయన సమీక్షించారు. అదేవిధంగా వినోద కార్యక్రమాల కోసం సిద్ధం చేసిన కాళీ మైదానం, తాత్కాలిక దుకాణాలు, పార్కింగ్ ప్రదేశాలు వంటి ప్రాంతాలను కూడా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టాలని, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు సమర్థంగా అమలు చేయాలని సూచించారు. అమ్మవారి శతాబ్ది జాతర మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.
స్థానిక అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మార్వోకు వివరాలు అందించి, అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేస్తామని తెలిపారు.
The post ఉత్తరాంధ్ర ఇలవేల్పు జాతరకు ఘన ఏర్పాట్లు appeared first on Visalaandhra.


