ఉచిత ప్రవేశ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి


–ఎంఈఓ తిరుమలరావు

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఈ నెల 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక నారాయణ ప్రైమ్ స్కూల్‌లో 6వ నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉచిత ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ తిరుమలరావు తెలిపారు. సోమవారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ తిరుమలరావు చేతులమీదుగా ఉచిత ప్రవేశ పరీక్ష కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరిట్ ఆధారంగా ఉచిత ప్రవేశాలు, ఫీజుల్లో ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని చెప్పారు. మండలంలోని పరిసర గ్రామాల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8186987581, 9000866618 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరేష్, ఈశ్వరప్ప, సతీష్ కుమార్, నీలకంఠ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *