ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. యువర్స్ ఫౌండేషన్


విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల రాంనగర్లో ఉన్న శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు మార్చి 1వ తేదీ ఆదివారం ఉదయం పదిగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమును నిర్వహిస్తున్నట్లు యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వెంకట నాగార్జున, పిఆర్వో రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు స్వాతి క్లినిక్ లో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం కీర్తిశేషులు డాక్టర్ సింగనమల నాగమణి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరం యువర్ ఫౌండేషన్ తో పాటు శ్రీ శంకర క్యాన్సర్ ఫౌండేషన్ బెంగళూరు వారి సహాయ సహకారములతో నిర్వహిస్తున్నామని తెలిపారు. బెంగళూరు నుండి క్యాన్సర్ ప్రత్యేక వైద్యులు ఉచిత పరిక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రత్యేక వైద్య బృందంలో డాక్టర్ బి.ఎస్ శ్రీనాథ్, డాక్టర్ వినాయక్, డాక్టర్ రేఖ, డాక్టర్ ప్రదీప్ రెడ్డి, డాక్టర్. ఆనంద్ పాల్గొని వైద్య చికిత్సలతో పాటు తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి కూడా వివరిస్తారని తెలిపారు. రక్తము కారుట, దురద పెట్టడం, ఆహారం మింగలేకపోవడం, ఎక్కువ కాలంగా అజీర్ణంగా ఉండడం, బరువు తగ్గుట, అసాధారణంగా రక్తము లేదా ఇతర శ్రావణము కలుగుట, గళ్ళలో రక్తము పడుట, అకారముగా తలనొప్పి ఎక్కువగా అప్పుడప్పుడు ఉండుట, నొప్పి లేకుండా మూత్రములో రక్తము పడుట, రొమ్ము మన నుండి రక్తము లేక నీరు కారుట లాంటివి క్యాన్సర్ లక్షణాలని తెలిపారు. కావున పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలు ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకుని తమ ఆరోగ్యమును పదిలంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి వి సుబ్బారావు, పోలా ప్రభాకర్, చాంద్ భాషా, లక్ష్మీనారాయణ, మోహన్, వైకే శ్రీనివాసులు, బండపల్లి రంగనాథ్, ఓవి ప్రసాద్, కౌన్సిలర్ కేతా లోకేష్, గర్రె రమేష్ బాబు తదితర సభ్యులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *