ఉచితాలు ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం


డీఎంకే మ్యానిఫెస్టో కమిటీ హెడ్, ఎంపీ కనిమొళి

చెన్నై: తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో డీఎంకే మ్యానిఫెస్టో కమిటీ హెడ్, ఎంపీ కనిమొళి పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఉచిత హామీలపై వివరణ ఇచ్చారు. ఉచితాలపై భిన్నాభిప్రాయాలున్నాయని, తాము మాత్రం దాన్ని ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం అని చెప్పారు. తమ మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ… గతంలో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్ప్పుడు డబుల్ బర్నర్ గ్యాస్ స్టవ్‌లు ఇచ్చారు. పొగపొయ్యిలు తగ్గిన ఫలితంగా మహిళల ఆరోగ్యమూ మెరుగైంది. ఆడపిల్లకు 10వ తరగతి పూర్తి చేయిస్తే పెళ్లి మేం చేస్తామని చెప్పారు. ఆ ప్రయత్నంతోనే ఇప్ప్పుడు అమ్మాయిలు చదువులపై శ్రద్ద వహిస్తు కాలేజీ బాట పట్టారు. ఇటువంటి ఉచితాలు మేలు చేస్తున్నాయికదా. ఇప్ప్పుడు పెద్ద చదువులకెళ్లే విద్యార్థులకు నెలకు రూ.1000 ఇస్తున్నాం. మళ్లీ ప్రభుత్వమోచ్చాక దానిని రూ.1500 చేయబోతున్నాం. పేద విద్యార్థులు చదువుకొనేందుకు ఇది గొప్ప అవకాశం అవుతోందన్నారు.
ప్రజలకు ‘కూపన’ బాగా చేరువైంది…
ప్రజల దగ్గర ఉన్నది ఇవ్వడం కాకుండా వారికి అవసరమయ్యేదే ఇవ్వాలి. మ్యానిఫెస్టో రూపొందించే సమయంలో ఇదే ఆలోచించాం. ఇంటిì అవసరాలకు సంబంధించి మహిళపై భారాన్ని తగ్గించి, వారి అవసరాలు తీరే విధంగా ఆలోచించుకున్నాం. అలా పుట్టిన ఆలోచనే… ‘రూ.8వేల కూపన’. ఇప్ప్పుడది బాగా ప్రజాదరణ పొందింది. అధికారంలోకి వచ్చాక దానిని నెరువేరుస్తాం. మహిళలకు మరో భరోసా… నెలకు రూ.1000 మహిళలకు భృతి ఇస్తున్నాం. రూ.2వేలకు పెంచేందుకు హామీ ఇచ్చాం. ఇది కేవలం మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కోసం మాత్రమే. వారి చిన్నచిన్న అవసరాలు తీరడానికి, డబ్బులకోసం ఇతరులపై ఆధారపడే పరిస్థితుల్ని ఈ పథకం తగ్గిస్తుంది. ఈ డబ్బుతోనే వారి మొత్తం అవసరాలు తీరతాయని, వారు పనులకెళ్లాల్సిన అవసరంలేదని కాదు కొంత ఆర్ధిక తోడ్పాటు.
మ్యానిఫెస్టో రూపొందించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికే ప్రజలకు చాలా రకాల పథకాలు అందించారు. ఇంకా ఎలాంటి సౌలభ్యాలు ఇవ్వాలనేదే సవాల్‌గా మారింది. ప్రజలకు చేయడానికి సాధ్యమయ్యేవాటికే ప్రాధాన్యం ఇవ్వమని కమిటీకి ముఖ్యమంత్రి సూటిగా చెప్పడంతో అదే చేశాం అని కనిమొళి తెలిపారు.

The post ఉచితాలు ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *