ఉగ్రముప్ప్పు – అప్రమత్తం


హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో కుట్ర
దేశవ్యాప్త దాడులకు లష్కరే తోయిబా ప్రణాళిక
నిఘా వర్గాల హెచ్చరిక

ఉగ్రవాదులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) దాడికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దేశరాజధాని దిల్లీ, హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు వెల్లడించాయి. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు ములాఖత్‌లో ఉగ్రకుట్రకు పథక రచన జరిగినట్లు తెలుస్తోంది. జైలు నుంచే నగరంలో విధ్వంసానికి కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.

న్యూదిల్లీ/హైదరాబాద్: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారతదేశంపై మరో కుట్రకు సిద్ధమైంది. దిల్లీ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నింది. ఎర్రకోట సమీపంలో, చాందినీ చౌక్‌లోని ఒక ఆలయం సహా దేశవ్యాప్తంగా ప్రముఖ మత ప్రదేశాల సమీపంలో పేలుళ్లకు ప్లాన్ చేస్తుందని భద్రతా సంస్థల నిఘా వెల్లడించింది. ఉగ్రవాదులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) దాడికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దేశరాజధాని దిల్లీ, హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు వెల్లడించాయి. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు ములాఖత్‌లో ఉగ్రకుట్రకు పథక రచన జరిగినట్లు తెలుస్తోంది. జైలు నుంచే నగరంలో విధ్వంసానికి కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ములాఖత్‌కు వచ్చిన వ్యక్తులతో ఉగ్రదాడులపై సంభాషణలు చేసినట్లు సమాచారం. జైలు నుంచే ప్రణాళికలు సాగినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది కుట్ర చేసినట్లు సమాచారం. నిఘావర్గాల హెచ్చరికతో ముసారంబాగ్, సైదాబాద్, మలక్‌పే{ ప్రాంతాలపై పోలీసులు నిఘాపెట్టారు. ప్రముఖ దేవాలయాలను టార్గెట్‌గా చేసుకుని పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. దిల్లీలో ఎర్రకోటతోపాటు దేశవ్యాప్తంగా మత ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో ఉగ్ర మూకలు దాడులకు పథక రచన చేస్తున్నట్టు నిఘావర్గాలు గుర్తించాయి. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా(ఎలఈటీ) దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఐఈడీ బాంబులతో దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫిబ్రవరి 6న పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోని మసీదు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా ఎలఈటీ ఈ దాడులకT కుట్ర చేస్తోంది. ఇస్లామాబాద్ దాడిలో 31 మంది మరణించగా… 160 మంది గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఐఎస్ ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. గతేడాది నవంబర్ 10న దిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన కారుబాంబు దాడిలో 12 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇంతకు రెండింతల మంది గాయాలపాలయ్యారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ పేలుడు పదార్థాలున్న కారుతో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. డీఎనఏ పరీక్షల ఆధారంగా అతడిని గుర్తించారు. అంతకుముందు, పోలీసులు హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఏకంగా 2,900 కేజీల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని భారీ ఉగ్రకుట్రను ఆదిలోనే భగ్నం చేశారు.
కశ్మీర్‌లో ఐఈడీ గుర్తించిన సైనికులు
పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు నిఘావర్గాలు వెల్లడించిన నేపథ్యంలో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి. గండేర్‌బాల్ జిల్లాలో రోడ్డు పక్కన ఓ బ్యాగులో మందుపాతర (ఐఈడీ)ను భారత సైన్యం గుర్తించి నట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ సాయంతో పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసినట్లు అధికారులు తెలిపారు. సఫాపోరా ప్రాంతంలోని కోహెస్థాన్ కాలనీకి సమీపంలోని గులాబ్ షేక్ మొహల్లా వద్ద రోడ్డుపక్కన ఐఈడీ ఉన్న బ్యాగును అధికారులు గుర్తించారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని, వాహనాల రాకపోకలు నిలిచిపోయా యని అధికారులు తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఏవైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలను కోరారు.

The post ఉగ్రముప్ప్పు – అప్రమత్తం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *