ఇరాన్ సుప్రీం లీడర్ ఖామేని
తెహ్రాన్ : ఇస్లామిక్ రిపబ్లిక్ ను కూలదోయడం అమెరికాకి ఎప్పటికీ సాధ్యం కాదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖామేని వ్యాఖ్యానించారు. అమెరికా- ఇరాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఖామేని ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో బలమైన సైనిక శక్తి ఉన్నవాళ్లకు తీవ్ర ఎదురు దెబ్బ తగలవచ్చు అన్నారు. ఇరాన్ పాలన మార్పు, యుద్ధ నౌకల మోహరింపు పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తూ ఉన్న ప్రకటనల నేపథ్యంలో ఖామేని ఈ వ్యాఖ్యలు చేశారు. జెనీవా వేదికగా ఇరాన్- అమెరికాల మధ్య పరోక్ష అను చర్చలు జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. “తమ సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నారు. అయితే… ఒక్కోసారి అది కోలుకోలేనంత దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఇరాన్ దిశగా యుద్ధనౌకలను పంపించామని ప్రకటనలు చేస్తున్నారు. ఆ నౌకలు నిజంగా ప్రమాదకరమైనవి. కానీ, వాటిని సముద్రంలో ముంచేసే సామర్ధ్యమున్న ఆయుధం మరింత ప్రమాదకరం. 47 ఏళ్లుగా ఇస్లామిక్ రిపబ్లిక్ ను ఏమీ చేయలేకపోయామని అమెరికా అంగీకరించడం శుభపరిణామం. ఎన్నటికీ ఏమి చేయలేరు. అణు చర్చలు జరుపుదాం అంటున్నారు కానీ… మీ దగ్గర అన్వాయుధాలు ఉండకూడదు అని చెబుతున్నారు. చర్చల ఫలితాలను ముందుగానే నిర్ధారించడం తప్పిదం, మూర్ఖత్వమే అని ఖామేని వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. జెనీవా వేదికగా అమెరికా- ఇరాన్ మధ్య జరిగిన అణు చర్చలు మూడు గంటల్లోనే ముగిశాయి. చర్చల సమయంలోనే హార్మోజ్ జలసంధిలో ఇరాన్ సైనిక విన్యాసాలు చేపట్టింది. ఈ సందర్భంగా జల సంధిని కొన్ని గంటలపాటు మూసివేసింది. ఈ క్రమంలో లైవ్ క్షిపణులను ప్రయోగించడం గమనార్హం ఆ ప్రాంతంలో అమెరికా సైన్యాన్ని మోహరించిన వేళ తెహ్రాన్ ఈ చర్యలకు ఉపక్రమించింది.
The post ఇస్లామిక్ రిపబ్లిక్ ను కూలదోయలేరు appeared first on Visalaandhra.


