ఇరాన్ యురేనియం శుద్ధి చేయలేదు


జెరూసలేం: పశ్చిమాసియా యు ద్ధంలో ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బతీసి నట్లు ఇజ్రాయిల్ ప్రకటించుకుంది. యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణుల తయారీ సామర్థ్యాన్ని ఇరాన్ కోల్పోయిందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. నిర్దేశించుకున్న మూడు లక్ష్యాలు సాధించడమే ఇరాన్‌పై యుద్ధం ముఖ్య ఉద్దేశంగా తెలిపారు. ఇరాన్ నుంచి అణుముప్ప్పును తొలగించడం, దాని సైనిక సామర్థ్యాలను అణగదొక్కడం, అక్కడి ప్రజలకు స్వేచ్ఛ కల్పించడమే అజెండాగా నెతన్యాహు చెప్పారు. ఇరాన్‌కు భారీగా నష్టం కలిగించా మని, క్షిపణి నిల్వలు, వాటి ఉత్పత్తి పరిశ్రమలను దెబ్బతీసినట్లు వెల్లడించారు. అదే సమయంలో భూతల దాడులకు తమ దళాలు సిద్ధమవుతున్నట్లు నెతన్యాహు సంకేతాలు ఇచ్చారు.వైమానిక దాడుల కారణంగా ఇరాన్ ప్రభుత్వం కుప్పకూలదని ఆయన చెప్పారు. గాల్లో నుంచి విప్లవాలు సాధ్యం కాదని, భూతల కార్యాచరణ అవసరమని, త్వరలోనే ఆ దిశగా చర్యలు ఉంటాయన్నారు. అయితే ఆ వివరాలు పంచుకోవాలనుకోవడం లేదని నెతన్యాహు అన్నారు. ‘ఇరాన్‌ను ఒంటరి చేస్తూ… మేము పై చేయి సాధిస్తున్నాం’ అని వెల్లడించారు. ఇరాన్ అస్త్ర సంపద మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్నామని అన్నారు. యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని ఇరాన్ కోల్పోయిందని మౌఖికంగా చెబుతున్నారేకానీ సరైన ఆధారాన్ని చూపడంలేదు. యుద్ధంలోకి అమెరికాను లాగారన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ‘మీరు ఇలా చేయండి అని ట్రంప్‌కు ఎవరైనా చెప్పగలరా? ఆయన వింటారా? అని నెతన్యాహు ప్రశ్నించారు. తాను ఎవరినీ మభ్యపెట్టలేదని సమర్థించుకున్నారు. ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై సొంతంగా దాడి చేశామని, మరోసారి ఇలా చేయొద్దంటూ ట్రంప్ హెచ్చరించారని నెతన్యాహు తెలిపారు.ట్రంప్ సూచనలకు కట్టుబడుతామన్నారు. అమెరికా ప్రయోజనాల దష్ట్యా ట్రంప్ నిర్ణయాలు ఉంటాయని నెతన్యాహు చెప్పారు. యుద్ధం ఇప్పటివరకు వైమానిక దాడులతో జరుగుతుందని, ఇకపై భూతల దాడులకు అవకాశం ఉంటుందన్నారు. ‘భవిష్యత్ దాడుల బాధ్యత మీదేనని ట్రంప్ అన్నారు… అందుకు కట్టుబడే ఉన్నాం’ అని నెతన్యాహు వెల్లడించారు.

The post ఇరాన్ యురేనియం శుద్ధి చేయలేదు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *